Friday, September 13, 2024

బానిస‌త్వంపై పిడికిలెత్తిన ధైర్యం.. మేడే..

Must Read

19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం ప్రపంచాన్ని చుట్టేసింది. దీంతో ఆమెరికా, యూరప్‌ దేశాలలో అనేక భారీ పరిశ్రమలు స్థాపించారు. ఈ పరిశ్రమల్లో పనిచేసేందుకు అసంఖ్యాకంగా కార్మికుల అవసరం ఏర్పడింది. దీనితో ఉత్పత్తిరంగంలో పెట్టుబడిదారులు, కార్మికులు అని రెండు వర్గాలు ఏర్పడ్డాయి. పెట్టుబడిదారులు అధిక లాభాలకోసం కార్మికుల శ్రమను విచక్షణా రహితంగా దోచుకోవడం ప్రారంభించారు. కార్మికులతో కనీసం రోజుకు 16 గంటల నుండి 20 గంటలు పనిచేయించేవారు. పైగా పనిచేసే కర్మాగారాలలో సరియైన గాలి, వెలుతురు ఉండేవికావు.

దాంతో కొందరు కార్మికులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయేవారు. కార్మికులు వారి శ్రమను మరచిపోవడానికి పాటలుపాడినా, విశ్రాంతి తీసుకున్నా యాజమానులు కోపోద్రిక్తులై ధిక్కార నేరం కింద జరిమానా విధించేవారు. ఈ దారుణ చర్యల నేపధ్యంలో కార్మికులలో క్రమక్రమంగా తిరుగుబాటుధోరణి మొదలైంది. కార్మిక సంఘాల నిర్మాణం ప్రారంభించారు. 1764-1800 మధ్య బ్రిటన్‌లోనూ, ఆ తరువాత యూరప్‌లోనూ, ట్రేడ్‌ యూనియన్ల నిర్మాణం జరిగింది. అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో చైతన్యవంతులైన కార్మికులు 1806లో మెకానిక్స్‌ యూనియన్‌ పేరిట తొలి కార్మిక సంఘాన్ని స్థాపించుకొన్నారు. పనిగంటలు తగ్గించాలని, న్యాయబద్ధంగా వేతనాలు చెల్లించాలని (ట్రేడ్‌ యూనియన్లను గుర్తించాలని) కర్మాగారాలలో కనీస వసతులు కల్పించాలని, తగినంత విశ్రాంతినివ్వాలని కోరుతూ కార్మికవర్గం విప్లవ శంఖం పూరించింది.


ప్ర‌పంచ పండుగ‌!
ఆ పోరాట జ్వాలలు బ్రిటన్‌, ఫ్రాన్సు, జర్మనీ దేశాలకు, అమెరికాలోని మిగతా ప్రాంతాలకు వ్యాపించాయి. 1818లో ఇంగ్లాండులోని స్టాల్‌పోర్టు పట్టణంలో బట్టల ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు సమ్మె ప్రారంభించారు. ప్రపంచ పరిశ్రమలకు ప్రసిద్ధిచెందిన లయాన్స్‌ పట్టణంలో 1831-1834లలో కార్మికులు తిరుగుబాటు చేశారు. ఆపై 1848లో ప్యారిస్‌లో కూడా పోరాటాలు జరిగాయి. అదే సమయంలో జర్మనీ, ఆస్ట్రేలియాలోనూ కార్మికుల తిరుగుబాటు చేశారు. ఆపై 1848లో ప్యారిస్‌లో కూడా సమ్మెలు జరిగాయి. జర్మనీ, అస్ట్రేలియాలోనూ కార్మికుల తిరుగుబాట్లు జరిగాయి.

ఇలా ఆయా దేశాల్లో ర‌గిలిన అగ్నిజ్వాల అమెరికాను తాకింది. 1886 మే1 అమెరికాలోని చికాగోలో 18 గంటల పనివిధానం వ్యతిరేకిస్తూ 8 గంటల పని విధానం ప్రవేశపెట్టాలని కోరుతూ కార్మికులు పోరాటానికి దిగారు. ఈ పోరాటంలో అనేకమంది కార్మికులు అమరులై తమ హక్కును సాధించుకున్నారు. వారి త్యాగానికి, స్పూర్తికి గుర్తుగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే ఆవిర్భ‌వించింది. మన దేశంలో మొట్టమొదటి సారి మద్రాసు కేంద్రంగా 1923వ సంవత్సరం మే1వ తేదిన లేబర్‌ కిసాన్‌ పార్టీ ఆఫ్‌ హిందుస్థాన్‌ అధ్వర్యంలో మే డే ఉత్సవాలను నిర్వహించారు. అలా మొదలై నేడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో మేడే ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నారు.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img