Monday, June 17, 2024

మానుకోట జిల్లాలో దారుణం

Must Read
  • ఆరో త‌ర‌గతి బాలిక‌ను గ‌ర్భ‌వ‌తిని చేసిన దుర్మార్గులు
  • నిందితుల్లో ఇద్ద‌రు మైన‌ర్లు, ఒక మేజ‌ర్‌
    అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : మ‌హ‌బూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండ‌లం జాజు తండా గ్రామ పంచాయ‌తీ ప‌రిధిలో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. 6వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న మైన‌ర్ బాలిక‌పై అదే గ్రామానికి చెందిన ముగ్గురు లైంగిక‌దాడికి పాల్ప‌డ‌గా ఆమె గ‌ర్భం దాల్చింది. కాగా ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. విశ్వ‌స‌య‌నీయ స‌మ‌చారం మేర‌కు… జాజు తండాకు చెందిన ఓ మైన‌ర్ బాలిక ఆరో త‌ర‌గ‌తి చ‌దువుతోంది. ఇదే తండాకు చెందిన ఇద్ద‌రు మైన‌ర్ బాలురు, ఓ యువ‌కుడు క‌లిసి బాలిక‌పై కొద్దికాలంగా లైంగిక‌దాడికి పాల్ప‌డుతు న్నారు. ఈక్ర‌మంలో సోమవారంరాత్రి బాలిక‌కు జ్వ‌రం రావ‌డంతో త‌ల్లిదండ్రులు ద‌వాఖాన‌కు తీసుకెళ్లారు. చికిత్స అందించిన వైద్యులు బాలిక ఆరు నెల‌ల గ‌ర్భ‌వ‌తి అని నిర్దారించి త‌ల్లిదండ్రుల‌కు తెలిపారు. బాలిక‌ను త‌ల్లిదండ్రులు నిల‌దీయ‌గా జ‌రిగిన విష‌యం తెలిపింది. అయితే ఈ ఘ‌ట‌న‌ను పోలీసులు అధికారికంగా ధృవీక‌రించ‌లేదు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img