Friday, September 13, 2024

నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌… గురుకులాల్లో 9, 231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

Must Read

హైద‌రాబాద్ : బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల విద్యాల‌యాల సొసైటీ ప‌రిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ ప్రభుత్వం చ‌ర్యలు చేప‌ట్టింది. తొలిద‌ఫాలో వివిధ కేట‌గిరీల్లో మొత్తం 9, 231 పోస్లుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ మేర‌కు తెలంగాణ గురుకుల విద్యాల‌యాల సంస్థ రిక్రూట్‌మెంట్ బోర్డు (ట్రిబ్‌) క‌న్వీన‌ర్ నోటిఫికేష‌న్ జారీ చేశారు. ఆయా పోస్టుల భ‌ర్తీకి సంబంధించి 12వ తేదీ నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నుంది.
వారంలో మ‌రో వెయ్యి పోస్టులు..
మొత్తంగా 13,675 పోస్టుల్లో గ్రూప్‌- 3, గ్రూప్ -4 పోస్టుల మిన‌హా మిగ‌తా 10,675 పోస్టుల భ‌ర్తీని ట్రిబ్ ద్వారా చేప‌ట్టనున్నారు. అందులో తొలిద‌ఫాగా ప్రస్తుతం 9231 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. మిగ‌తా పోస్టులకు సంబంధించి అందులో కొన్ని కొత్తగా, మెస్ ఇన్‌చార్జి, మ‌రికొన్ని పోస్టుల‌కు స‌ర్వీస్ రూల్స్‌ను రూపొందించాల్సి ఉంది. అదికాకుండా కొన్ని న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు ఉన్నాయి. వాట‌న్నింటినీ ప‌రిష్కరించి మ‌రో వారం రోజుల్లో మిగిలిన పోస్టుల భ‌ర్తీకి సైతం నోటిఫికేష‌న్ జారీ చేసేందుకు చర్యలు చేప‌ట్టింది. ఇక గురుకులాల‌కు మంజూరైన ఏఎన్ఎం, స్టాఫ్ న‌ర్స్ పోస్టుల‌ను మెడిక‌ల్ బోర్డు చేప‌ట్టనుంది. ఆ నేప‌థ్యంలో ఎలాంటి వివాదాలు లేని పోస్టుల భ‌ర్తీ ప్రక్రియను చేప‌ట్టింది.
భ‌ర్తీ చేయ‌నున్న పోస్టులు కేట‌గిరి వారీగా..
డిగ్రీ లెక్చరర్ పీడీ, లైబ్రేరియన్‌ 868
జూనియ‌ర్ లెక్చరర్‌, లైబ్రేరియన్‌, పీడీ 2008
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (పీజీటీ) 1276
ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్స్ (టీజీటీ) 4090
లైబ్రేరియ‌న్ స్కూల్ 434
ఫిజిక‌ల్ డైరెక్టర్స్‌ ఇన్ స్కూల్ 275
డ్రాయింగ్ టీచ‌ర్స్ ఆర్ట్ టీచ‌ర్స్ 134
క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్‌, క్రాఫ్ట్ టీచ‌ర్స్ 92
మ్యూజిక్ టీచ‌ర్స్ 124
మొత్తం 9231

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img