Tuesday, June 25, 2024

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ… ఇద్దరి మృతి

Must Read

అక్షరశక్తి, భీమదేవరపల్లి: ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్య పూర్ గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మాణిక్య పూర్ గ్రామానికి చెందిన తాళ్లపల్లి నిరంజన్ (31) తన మామ తో ద్విచక్ర వాహనంపై మాణిక్యపూర్ గ్రామం నుండి హుజురాబాద్ వెళ్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని గట్ల నర్సింగాపూర్ గ్రామానికి చెందిన గట్టు గోపి (30) హుజురాబాద్ నుండి తన స్వగ్రామానికి వస్తున్నాడు. ఈ రెండు ద్విచక్ర వాహనాలు మాణిక్యాపూర్ గ్రామ సమీపంలోకి రాగానే వేగంగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తాళ్లపల్లి నిరంజన్, గట్టు గోపి అక్కడికక్కడే మృతి చెందగా నిరంజన్ మామ కు తీవ్ర గాయాలు కాగా 108 వాహనంలో వరంగల్ ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన తాళ్లపల్లి నిరంజన్ రోజు వారీ కూలీగా పనిచేస్తున్నాడు. నిరంజన్ కు ఆరు నెలల క్రితమే వివాహం జరిగింది. మరొక మృతుడు గట్టు గోపి ఓ ప్రయివేటు సీడ్ కంపెనీలో పని చేస్తున్నాడు. ప్రమాద సంఘటన గూర్చి సమాచారం అందుకున్న ఎల్కతుర్తి సిఐ ప్రవీణ్ కుమార్, ముల్కనూర్, వంగర ఎస్సైలు మహేందర్, వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img