Friday, September 13, 2024

భూపాల‌ప‌ల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం..

Must Read
  • కెనాల్ ప‌డిన బొలెరో వాహనం
    వాహనం
  • 15 మంది కూలీలకు గాయాలు
    అక్ష‌ర‌శ‌క్తి, రేగొండ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. వ‌ల‌స కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం కాలువ‌లో బోల్తా పడిన ఘ‌ట‌న‌లో 15 మంది కూలీలు గాయపడ్డారు.
  • ప్ర‌త్య‌క్ష సాక్షుల కథనం ప్రకారం…. మహారాష్ట్రకు చెందిన వలస కూలీలు కొన్ని నెలల క్రితం కూలీ పనులు కోసం ఆంధ్రప్రదేశ్​కు వెళ్లారు. అయితే కూలీలకు సంబంధించిన ఓ కుటుంబంలో పెళ్లి ఉండడంతో వారు మహారాష్ట్రకు తిరుగు పయణం అయ్యారు.
  • ఈక్రమంలో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం వారు ప్రయాణిస్తున్న వాహనం రేగొండ మండలం జంషెడ్​పేట్ సమీపంలో ప్రమాదవశాత్తు అదుపుత‌ప్పి కెనాల్ లో పడిపోయింది. ఈ ఘటనలో 15 మంది కూలీలు గాయపడ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను పోలీసులు ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే కాలువ‌కు సమీపంలో రెండు ఈత చెట్లు ఉండడంతో వ్యాన్ ​వాటిని ఢీకొని మెల్లగా కాలువలో పడిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img