అక్షరశక్తి, హన్మకొండ: షైన్ విద్యాసంస్థల అధినేత మూగల కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాలసముద్రం నందు గల షైన్ కళాశాలలో ప్రిన్సిపాల్ మారబోయిన రాజు గౌడ్ ఆధ్వర్యం లో కేక్ కట్ మిఠాయిలు పంచారు. ఈసందర్భంగా షైన్ విద్యాసంస్థల అధినేత కుమార్ యాదవ్ మాట్లాడుతూ… ఎంతోమంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడంలో షైన్ విద్యాసంస్థలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అధ్యాపక బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు తమవంతు తోడ్పాటు అందిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో షైన్ విద్యాసంస్థల డైరెక్టర్ రాజేంద్ర కుమార్, డైరెక్టర్ మూగుల రమ, ఐఐటీ కో ఆర్డినేటర్ రమేష్ యాదవ్, కళాశాలల ప్రిన్సిపల్ మారబోయిన రాజు గౌడ్, ప్రశాంత్, రాజేందర్, బుచ్చిరెడ్డి, రాజు, మల్లికార్జున్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.