Friday, September 13, 2024

ఎస్ఐ ప‌రీక్ష‌ల తేదీలు ఖ‌రారు

Must Read

8, 9న ఎస్ఐ, ఏఎస్ఐ రాత ప‌రీక్ష‌లు
రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భ‌ర్తీకి నియామ‌క ప్ర‌క్రియ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఎస్ఐ, ఏఎస్ఐ ఉద్యోగాల‌కు సంబంధించిన తుది రాత‌ప‌రీక్ష‌ల తేదీల‌ను తెలంగాణ స్టేట్ లెవ‌ల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఖ‌రారు చేసింది. ఏప్రిల్ 8, 9వ తేదీల్లో ఈ రాత‌ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. ఎస్‌సీటీ ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టుల‌కు 8వ తేదీన ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు అర్థ‌మెటిక్, మెంట‌ల్ ఎబిలిటీ, మ‌ధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వ‌ర‌కు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేప‌ర్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఎస్‌సీటీ ఎస్ఐ (సివిల్) పోస్టుల‌కు 9వ తేదీన ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు జ‌న‌ర‌ల్ స్ట‌డీస్, మ‌ధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వ‌ర‌కు తెలుగు, ఉర్దూ లాంగ్వేజ్ పేప‌ర్ ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన హాల్ టికెట్ల‌ను ఏప్రిల్ 3వ తేదీ ఉద‌యం 8 గంట‌ల నుంచి 6వ తేదీ అర్థ‌రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు సంబంధిత వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చ‌ని అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img