సీఐ రమేష్ చందర్ పై అనేక అవినీతి ఆరోపణలు
అక్షరశక్తి, మహబూబాబాద్ : మహబూబాబాద్ ఎక్సైజ్ సీఐ రమేష్ చందర్ పై సస్పెన్షన్ వేటు పడింది. మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎమ్మార్పీకంటే ఎక్కువ ధరకు యథేచ్ఛగా మద్యం విక్రయాలు జరుగుతున్నా నియంత్రించడంలో విఫలం అయ్యారనే నివేదికతో అధికారులు సస్పెన్షన్ చేశారు. ఇటీవల బయ్యారంలోని కనకదుర్గ వైన్స్, కురవిలోని మీనాక్షి వైన్స్‌లో స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే విచారణ జరిపిన అధికారులు ఎక్సైజ్ సీఐపై సస్పెన్షన్ వేటువేశారు. వైన్ షాప్ యాజబాన్యాల సిండికేట్‌లోనూ సీఐ కీలకంగా పనిచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈనేపథ్యంలోనే సీఐ సస్పెన్షన్ కు గురవగా, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న మరి కొంత మంది అధికారులపై కూడా చర్యలు ఉండవచ్చునన్న సమాచారంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరుగె డుతున్నాయి. ఇక ఇప్పటికైనా.. మద్యం ధరలు నియంత్రణలోకి వస్తాయా..! జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్న బెల్ట్ షాప్‌ల దోపిడీకి అడ్డుకట్ట పడుతుందా.. వేచి చూడాలిమరి.
Must Read