Monday, June 17, 2024

సీపీ త‌రుణ్ జోషికి వీడ్కోలు

Must Read

బ‌దిలీపై హైద‌ర‌బాద్ వెళ్తున్న వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌ర్ డాక్ట‌ర్ త‌రుణ్ జోషికి శుక్ర‌వారం పోలీస్ సిబ్బంది వీడ్కోలు ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. వ‌రంగ‌ల్ న‌గ‌రంలో విధులు నిర్వ‌ర్తించ‌డం త‌న‌కు ఎంతో సంతృప్తిని ఇచ్చింద‌న్నారు. అధికారులు, సిబ్బంది త‌న‌కు పూర్తి స్థాయిలో స‌హ‌క‌రించార‌ని చెప్పారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు డీజీపీ కార్యాలయానికి బదిలీపై వెళ్ళుతున్న తరుణ్ జోషికి గౌర‌వ పూర్వ‌కంగా ఆర్మూడ్ రిజర్వ్ విభాగం పోలీసులు వీడ్కోలు పరేడ్‌ నిర్వహించారు. ఆర్మూడ్ రిజర్వ్, సివిల్, ట్రాఫిక్, హోంగార్డ్ పోలీస్ సిబ్బంది క‌వాతు నిర్వహించారు. అనంతరం సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. పూలతో అందంగా అలంకరించిన జీపులో త‌రుణ్ జోషిని కమిషనరేట్ కు చెందిన డిసిపి స్థాయి అధికారి మొదలలుకోని హోంగార్డు సిబ్బంది జీపు తాడుతో లాగి తమ అభిమానాన్ని చాటుతూ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషికి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో డిసిపిలు వెంకటలక్ష్మి, సీతారం, అదనపు డిసిపిలు వైభవ్ గైక్వాడ్, పుష్పా, సంజీవ్, సురేష్కుమార్ తో పాటు ఏసిపిలు, ఆర్.ఐలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్.ఎస్.ఐ, ఎస్.ఐలు పరిపాలన విభాగం సిబ్బందితో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img