Saturday, July 27, 2024

కవిత అరెస్ట్‌కు రంగం సిద్ధం… ! బీజేపీ నుంచి సిగ్నల్స్

Must Read

ఢిల్లీ లిక్కర్ స్కాం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం ఖాయమని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బీజేపీ నుంచి ఇన్‌డైరెక్ట్‌గా సిగ్నల్స్ వచ్చాయని తెలిపారు. ఈనెల 6న విచారణకు హాజరుకావాల్సిందిగా శుక్రవారం కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. కవితను అరెస్ట్ చేస్తామని బీజేపీ ఇన్‌డైరెక్ట్‌గా సిగ్నల్స్ ఇచ్చిందని, ఆమెను సీబీఐ అరెస్ట్ చేయబోతుందని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు బయటపడుతాయన్నారు. గత రెండు నెలలుగా ఎక్కడ చూసినా లిక్కర్ స్కాం, ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు మాత్రమే కనిపిస్తోందన్నారు. కవిత, బీఎల్ సంతోష్‌లు ఇద్దరూ నిందితులేనని చెప్పారు. కవిత, బీఎల్ సంతోష్‌లను వెంటనే అరెస్ట్ చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. బీఎల్ సంతోష్‌ను కాపాడుకునేందుకు జాతీయ, రాష్ట్ర బీజేపీ నేతలు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీ రెండూ స్కాంలలో చిక్కుకున్నామని, ఆ రెండు స్కాంల ప్రభుత్వాలేనని విమర్శించారు. బీఎల్ సంతోష్ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని, ఆయనను వెనుక నుంచి ప్రధాని మోదీ, అమిత్ షా నడిపిస్తున్నారని ఆరోపించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img