అక్షరశక్తి, వరంగల్ : శ్రీ విశ్వేశ్వర సంస్కృతాంధ్ర డిగ్రీ అండ్ పీజీ కళాశాల వరంగల్ , సెమినార్ హాల్ లో కళాశాల విస్తృత ఉపన్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ సోనబోయిన సతీష్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు ఆకారపు హరీష్ కుమార్ హాజరయ్యారు. తదనంతరం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా విస్తృత ఉపన్యాసానికి విచ్చేసినటువంటి కళాశాల పూర్వ విద్యార్థి డాక్టర్ సిహెచ్ నాగరాజు అసోసియేట్ ప్రొఫెసర్ సెంట్రల్ యూనివర్సిటీ తిరుపతి మాట్లాడారు. భారతీయ సంస్కృతికి మూలాధారం సంస్కృతం అనే అంశం మీద వారు విస్తృత ఉపన్యాసం చేశారు. సంస్కృతం మన యొక్క జీవన ఆధారం కాబట్టి సంస్కృతం లేకుండా మనం జీవనం సాగించలేం అనే విషయాన్ని తెలుపుతూ ఆర్యభట్ట చాణిక్యులు లాంటి గొప్ప మహర్షులు సంస్కృతంలో అనేకమైనటువంటి రచనలు చేశారు. సంస్కృత భాష చాలా పురాతనమైనదని రామాయణం మహాభారతం అనేక గ్రంథాలు ఉపనిషత్తులు వేదాలు సంస్కృతంలో వేదవ్యాసుల వారు రాయడం ఇంకా వారు మాట్లాడుతూ వారి గురువుగారైన శ్రీ భాష్యం విజయసారథిని సంస్కృత భాషలో అనేకమైనటువంటి రచనలు చేసినారు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పి రంగాచార్యులు, మేకల లింగమూర్తి, పి జయ కృష్ణ ,శ్రీధర్ల కుమారస్వామి,శెట్టి దేవరాజు, వై సుష్మిత ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు అనథ్యాపకులు రవీందర్, రాజు, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.