అక్షరశక్తి, పరకాల : పరకాల నియోజకవర్గం శాసనసభ స్థానం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా బొల్లికుంట గ్రామానికి చెందిన కాకతీయ యూనివర్సిటీ ఉద్యమ నేత సోల్తి.కిరణ్ గౌడ్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశించి భంగపడిన ఆయన.. ఈరోజు రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను పట్టించుకోకపోడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు