Tuesday, June 18, 2024

ప‌ర‌కాల‌లో బీజేపీ జెండా ఎగుర‌వేస్తాం..

Must Read
  • ఎమ్మెల్యే అభ్య‌ర్థి డాక్ట‌ర్ కాళీప్ర‌సాద్
  • నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృత ప్ర‌చారం

అక్షరశక్తి, పరకాల టౌన్: పరకాల బిడ్డగా మీ ముందుకు వస్తున్నా.. ఆశీర్వ‌దించి ఒక్క అవ‌కాశం ఇవ్వండి.. ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజ‌క‌వ‌ర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా… బీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీల మాయ మాట‌లు న‌మ్మి మ‌రోసారి మోస‌పోవ‌ద్దు.. అని పరకాల నియోజ‌క‌వ‌ర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కాళీప్రసాద్ రావు అన్నారు. గురువారం పరకాలలోని అంబేద్కర్ కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళుర్పించారు. అనంత‌రం పట్టణంలో ప్ర‌చారం నిర్వ‌హించారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను క‌లిసి బీజేపీకి ఓటు వేయాలని కోరారు. ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి పరకాల పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని, వర్తక, వ్యాపారాలు అభివృద్ధి చెందేందుకు మీ అందరి కుటుంబ సభ్యుడిగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మొలుగూరి బిక్షపతి, రాష్ట్ర నాయకులు దేవు సాంబయ్య, కాచం గురుప్రసాద్, దేవునూరి మేఘనాథ్, ఆర్పీ జయంత్ లాల్, మార్త బిక్షపతి, గోగుల రాజిరెడ్డి, పుట్ట రవీందర్, దుబాసి వెంకటస్వామి, పిట్ట వీరస్వామి, కొలనుపాక భద్రయ్య, బెజ్జంకి పూర్ణచారి, మార్త రాజభద్రయ్య, సిరంగి సతీష్ కుమార్, గాజుల నిరంజన్, కుక్కల విజయ్ కుమార్, నాగలి రంజిత్, సంఘ పురుషోత్తం, పాలకుర్తి తిరుపతి, మారేడు గొండ భాస్కరాచారి, దంచనాల సత్యనా రాయణ, దుబాసి కృష్ణ ప్రసాద్, మారబోయిన శివకుమార్, ఎరుకల దివాకర్, బీరం రాజిరెడ్డి, పిట్ట కిషోర్, ఆకుల రాంబాబు, చెరుపెల్లి సునీల్, ఒంటేరు వీరేష్, సాంబమూర్తి, మామిళ్ళపల్లి సారంగపాణి, దార్న నారాయణదాసు, బండారి కృష్ణ, చిలువేరు చిరంజీవి, మంద రామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీలోకి భారీగా చేరిక‌లు
పరకాల నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుండి బీజేపీలోకి చేరికల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా గురువారం నడికూడ మండలం నార్లాపూర్, పులిగిల్ల, దామెర మండలం కోగిలవాయి, పరకాల మండలం వెల్లంపల్లి గ్రామాలకు చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు 200 మంది బీజేపీలో చేరారు. ఈమేర‌కు పరకాల పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కాళీ ప్రసాద్ కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాళీ ప్రసాద్ మాట్లాడుతూ…పరకాల గ‌డ్డ‌పై కాషాయ జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌న్నారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్య‌మ‌ని భావించి పెద్ద సంఖ్య‌లో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీల నుంచి బీజేపీలో చేరుతున్నార‌ని అన్నారు. నియోజకవర్గంలో బీజేపీని ఆదరిస్తూ పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. బిజెపి పార్టీ ఒక్క కార్యకర్త ఇతర పార్టీల వంద మంది కార్యకర్తలతో సమానమని, ప్రతి ఒక్కరు పార్టీ గెలుపు కోసం కృషిచేయాల‌ని, ఇంటింటి ప్రచారంలో పాల్గొని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్పీ జయంతి లాల్, పరకాల పట్టణ ప్రచార కమిటీ ఇన్చార్జి దుబాసి వెంకటస్వామి, పరకాల పట్టణ అధ్యక్షుడు మార్త బిక్షపతి, నడికూడ అధ్యక్షులు గోగుల రాజిరెడ్డి, భూత్ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, పిట్టల రమేష్, చిలువేరు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img