Saturday, July 27, 2024

పెద్దికి ఊరూరా ఘ‌న‌స్వాగ‌తం

Must Read
  • మంగ‌ళ హారతుల‌తో మహిళల బ్ర‌హ్మ‌ర‌థం
  • అభివృద్ధికి ప‌ట్టంక‌ట్టాలంటూ ఎమ్మెల్యే సుద‌ర్శ‌న్‌రెడ్డి పిలుపు
  • న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గంలో కారు జోరు..
    అక్ష‌ర‌శ‌క్తి, న‌ర్సంపేట‌: ఖానాపురం మండ‌లం దబ్బీర్ పేట, కీర్య తండాల్లో పెద్ది ఎన్నికల ప్రచారం నిర్వ‌హించారు. పెద్ద ఎత్తున మహిళలు హారతులు ఇచ్చి, పూల వర్షం కురిపించి స్వాగతం ప‌లికారు. రెండు గ్రామాల్లో పెద్ది ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు. అడవిలో ఉన్న కీర్యా తండాను గుర్తించి కేసీఆర్ ఆశీర్వాదంతో గెజిట్ నోటిఫికేషన్ అందించి తండాను గ్రామపంచాయతీగా మార్చిన‌ చరిత్ర త‌న‌దే అన్నారు. మీ రాజ్యంలో మీ పాలన అందించిన కేసీఆర్ కు కృతజ్ఞతగా కారు గుర్తుకు ఓటు వేసి బలాన్ని అందించాలని కోరారు. ఈ ప్రాంత సస్యశ్యామలం కోసం ఏ నాయకుడు చెయ్యని కార్యదీక్షను సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో రూ. రూ. 336 కోట్ల రూపాయలతో గోదావరి జలాలు తీసుకొచ్చాన‌న్నారు. గోదావరి జలాలు కూడా మొదటిగా కీర్య తండా గిరిపుత్రుల పాదాలు, పంటపొలాలు తడిసిన తర్వాతనే పాకాల సరస్సులోకి అడుగు పెడుతున్నాయ‌న్నారు. దబ్బిర్ పేట గ్రామంలో గిరిజనులకు సమానంగా గిరిజనేతరులు బీసీ కుల బాంధవులకు పోడు పట్టాలు అందించే బాధ్యత త‌న‌దే అన్నారు. ఏండ్ల తరబడి పేరుకుపోయిన అసైన్మెంట్ భూములకు ఎంజాయ్మెంట్ సర్వే చేయించి పట్టాలు అందిస్తాన‌ని హామీ ఇచ్చారు. దబ్బిర్ పేట గ్రామంలో వంద శాతం సిసి రోడ్లు అందించిన మీ బిడ్డను మళ్ళీ ఆశీర్వదించి అసెంబ్లీకి పంపే బాధ్యత మీదే అన్నారు. ఎన్నిక‌ల్లో గెలిపిస్తే గోదావరి జలాలను దబ్బీర్ పేట గ్రామ పెద్ద చెరువులోకి కాలువల ద్వారా తీసుకొచ్చే బాధ్య‌త తీసుకుంటాన్నారు. 1 కోటి 10లక్షల రూపాయలతో ఎస్టిమేషన్ పూర్తి అయ్యింద‌ని తెలిపారు. పాకాల రైతంగానికి రెండు పంటలు నీళ్లు రావాలని నేను కొండలు, గుట్టలు ఎక్కి సర్వే చేయుస్తుంటే రైతుల బాగు ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు కోర్టు స్టేలు తెచ్చినా మొక్కవోని దీక్షతో పనులు పూర్తి చేసి గోదావరి జలాలు తీసుకొచ్చామ‌ని అన్నారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img