ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కవితపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అవడం ఖాయమని జోస్యం చెప్పారు. మార్చి 10న కవిత అరెస్టు కాబోతుంది… ఇదే కేసీఆర్ పతనానికి ఆరంభం మాత్రమేనని పాల్ అన్నారు. తెలంగాణలో రైతులు, అమరవీరుల కుటుంబాలు, నిరుద్యోగుల కన్నీరు ఉసురు కేసీఆర్ కుటుంబానికి తాకిందని పాల్ అన్నారు.