అక్షరశక్తి, హన్మకొండ క్రైమ్ : ఖిలా వరంగల్ తూర్పుకోటలో దొంగలు బీభత్సం సృష్టించారు. తూర్పు కోటలో గల పెద్దమ్మ గుడిలో రెండు హుండీలు పగలగొట్టి నగదుతోపాటు వెండి హారం ఎత్తుకు వెళ్లారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.