Tuesday, June 18, 2024

ఆరు నెల‌ల్లో ముంద‌స్తు ఎన్నిక‌లు

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరు నెలల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్తారని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈడీ, ఐటీ సోదాలు.. టీఆర్ఎస్, బీజేపీ ఆడుతున్న డ్రామాలన్నారు. ఎఫ్ఆర్వో అధికారి హత్యకి సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం బీఎస్పీ పోరాడుతోంద‌ని, 52 శాతం ఉన్న బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఇస్తే ఎలా? అని ప్రశ్నించారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో ఆర్థికంగా వెనకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవకాశం ఇవ్వాలని, కేంద్రం బీసీ జనగణన చేయాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై నవంబర్ 26 నుంచి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రవీణ్ కుమార్ తెలిపారు. కోటి సంతకాల సేకరణ చేసి రాష్ట్రపతికి పంపుతామన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలన్నారు. తమిళనాడు, జార్ఖండ్‌లా తెలంగాణలో కూడా రిజర్వేషన్లు పెంచాలని ఆర్ఎస్‌ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img