Saturday, July 27, 2024

గ్రూప్స్ ప‌రీక్ష‌లకు సిద్ధం అవుతున్నారా..? ఇవి తెలుసుకోండి..

Must Read
  • గ్రూప్‌ -1 మార్కులు 900, గ్రూప్‌-2కు 600
  • మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక
  • నియామక ప్రక్రియను ప్రకటించిన ప్ర‌భుత్వం
  • మ‌ల్టీ జోన్ల‌వారీగా గ్రూప్ -1 పోస్టుల భ‌ర్తీ
  • జీవో 55 జారీ చేసిన సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : రాష్ట్రంలో కొలువుల జాత‌ర మొద‌లైంది. ఇప్ప‌టికే 16, 207 పోలీస్ ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌గా, అతి త్వ‌ర‌లో గ్రూప్ -1 నోటిఫికేష‌న్ జారీ చేసేందుకు టీఎస్‌పీఎస్‌సీ సిద్దం అవుతోంది. ఈమేర‌కు గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3, గ్రూప్‌-4, ఇతర క్యాటగిరీల పరీక్ష విధానం, సిలబస్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎన్ని పేపర్లు ఉంటాయి..? ఏ పేపర్‌కు ఎన్ని మార్కులు..? పరీక్ష రాసేందుకు ఎంత సమయం కేటాయిస్తారు… ? తదితర వివరాలతో జీవో నంబ‌ర్ 55ని జారీ చేసింది. గ్రూప్‌ -1 మెయిన్స్‌ను 900 మార్కులు, గ్రూప్‌-2ను 600 మార్కులకే నిర్వహించనున్నట్టు ప్ర‌భుత్వం ప్రకటించింది. ఇంటర్వ్యూల రద్దుతో గ్రూప్‌ -1లో 100 మార్కులు, గ్రూప్‌ -2లో 75 మార్కులను తొలగించింది. గ్రూప్‌ -1లో 19 రకాల పోస్టులు, గ్రూప్‌-2లో 16 రకాల పోస్టులు ఉన్నాయి. వివరాలు కింది విధంగా ఉన్నాయి.

 

గ్రూప్‌ -1 పోస్టులు:

డిప్యూటీ కలెక్టర్‌ (సివిల్‌ సర్వీసెస్‌, ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌)
డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ క్యాటగిరీ-2 (పోలీస్‌ సర్వీస్‌)
కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ (కమర్షియల్‌ ట్యాక్స్‌ సర్వీసెస్‌)
రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌ (ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసెస్‌)
జిల్లా పంచాయతీ ఆఫీసర్‌ (పంచాయత్‌ సర్వీసెస్‌)
జిల్లా రిజిస్ట్రార్‌ (రిజిస్ట్రేషన్‌ సర్వీసెస్‌)
డివిజినల్‌ ఫైర్‌ ఆఫీసర్‌ (ఫైర్‌ సర్వీస్‌)
డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ జైల్స్‌ – మెన్‌ (జైల్స్‌ సర్వీస్‌)
అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ (లేబర్‌ సర్వీస్‌)
అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ (ఎక్సైజ్‌ సర్వీస్‌)
మున్సిపల్‌ కమిషన్‌ గ్రేడ్‌ -2 (మున్సిపల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌)
అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (సోషల్‌ వెల్ఫేర్‌)
డిస్ట్రిక్ట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ (సోషల్‌ వెల్ఫేర్‌ సర్వీస్‌)
డిస్ట్రిక్ట్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఇన్‌క్లూడింగ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (డిస్ట్రిక్ట్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌)
డిస్ట్రిక్ట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ (ట్రైబల్‌ వెల్ఫేర్‌ సర్వీస్‌)
జిల్లా ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ (ఎంప్లాయ్‌మెంట్‌ సర్వీస్‌)
అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ ఇన్‌క్లూడింగ్‌ లే సెక్రటరీ అండ్‌ ట్రెజరీ గ్రేడ్‌-2 (మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌)
అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌/ట్రైనింగ్‌ కాలేజీ లేదా స్కూల్లోని అసిస్టెంట్‌ లెక్చరర్‌ (ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌ సర్వీస్‌)
అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ (స్టేట్‌ ఆడిట్‌ సర్వీస్‌) మండల పరిషత్తు డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (పంచాయతీరాజ్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ సర్వీస్‌)

పరీక్షలు:

ప్రిలిమినరీ టెస్ట్‌: జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ (ఆబ్జెక్టివ్‌ టైప్‌)లో 150 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. రెండున్నర గంటల పాటు నిర్వహించే ఈ పరీక్షను 150 మార్కులకు నిర్వహిస్తారు.
మెయిన్స్‌ రాత పరీక్షలో భాగంగా జనరల్‌ ఇంగ్లిష్‌ (క్వాలిఫైయింగ్‌ టెస్ట్‌) ఉంటుంది. 3 గంటల పాటు నిర్వహించే ఈ పరీక్షను 150 మార్కులకు నిర్వహిస్తారు.

మెయిన్స్‌ పేపర్లు
పేపర్ -1 (జనరల్‌ ఎస్సే)
వ్యవధి 3 గంటలు, మార్కులు 150 (పేపర్‌ -1 టాపిక్స్‌)
కాంటెంపరరీ సోషల్‌ ఇష్యూస్‌ అండ్‌ సోషల్‌ ప్రాబ్లమ్స్‌
ఇష్యూస్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ గోత్స్‌ అండ్‌ జస్టిస్‌
డైనమిక్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ పాలిటిక్స్‌
హిస్టారికల్‌ అండ్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ ఆఫ్‌ ఇండియా
డెవలప్‌మెంట్స్‌ ఇన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
ఎడ్యుకేషన్‌ అండ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌

పేపర్ -2 (హిస్టరీ, కల్చర్‌ అండ్‌ జాగ్రఫీ) వ్యవధి 3 గంటలు, మార్కులు 150
(పేపర్‌-2 టాపిక్స్‌): హిస్టరీ అండ్‌ కల్చర్‌ ఆఫ్‌ ఇండియా విత్‌
స్పెషల్‌ రెఫరెన్స్‌ టూ మోడ్రన్‌ పీరియడ్‌
(1757-1947 ఏడీ)
హిస్టరీ అండ్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ ఆఫ్‌ తెలంగాణ
జాగ్రఫీ ఆఫ్‌ ఇండియా అండ్‌ తెలంగాణ
పేపర్‌ -3
ఇండియన్‌ సొసైటీ, కాన్‌స్టిట్యూషన్‌ అండ్‌ గవర్నెన్స్‌
వ్యవధి 3 గంటలు, మార్కులు 150
(పేపర్‌-3 టాపిక్స్‌)
ఇండియన్‌ సొసైటీ స్ట్రక్చర్‌ ఇష్యూస్‌ అండ్‌
సోషల్‌ మూమెంట్స్‌
భారత రాజ్యాంగం, గవర్నెన్స్‌
పేపర్‌ -4
ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌
వ్యవధి 3 గంటలు, మార్కులు 150
(పేపర్‌-4 టాపిక్స్‌)
ఇండియన్‌ ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌
తెలంగాణ ఎకానమీ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రాబ్లమ్స్‌
పేపర్‌ -5
సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అండ్‌ డాటా ఇంటర్‌ప్రిటేషన్‌
వ్యవధి 3 గంటలు, మార్కులు 150
(పేపర్‌-5 టాపిక్స్‌)
ది రోల్‌ అండ్‌ ఇంపాక్ట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
మోడ్రన్‌ ట్రెండ్స్‌ ఇన్‌ అప్లికేషన్‌ ఆఫ్‌ నాలెడ్జ్‌ ఆఫ్‌ సైన్స్‌
డాటా ఇంటర్‌ప్రిటేషన్‌ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌
పేపర్‌ -6
తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు
వ్యవధి 3 గంటలు, మార్కులు 150
(పేపర్‌-6 టాపిక్స్‌)
ది ఐడియా ఆఫ్‌ తెలంగాణ (1948 – 1970)
మెబిలైజేషషనల్‌ ఫేజ్‌ (1971 -1990)
తెలంగాణ స్వరాష్ట్ర ఆవిర్భావం వరకు (1991 -2014)
మొత్తం మార్కులు: 900

 

పరీక్ష విధానం: ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉంటుంది. జనరల్‌ స్టడీస్‌ మెంటల్‌ ఎబిలిటీ పేపర్లకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. దీంట్లో షార్ట్‌ లిస్ట్‌ చేసిన అభ్యర్థులను మెయిన్స్‌కు అనుమతిస్తారు. ఈ మార్కులను ర్యాకింగ్‌ కోసం పరిగణనలోకి తీసుకోరు. ఈ పరీక్షను ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. మెయిన్స్‌కు మల్టీజోన్లవారీగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపికచేస్తారు. దీంట్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ను పాటిస్తారు. కులం, లింగం, ఈడబ్ల్యూఎస్‌, పీహెచ్‌, స్పోర్ట్స్‌ కోటాల ప్రకారం ఎంపిక చేస్తారు. మెయిన్స్‌ పరీక్షను సైతం తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌ భాషల్లో నిర్వహిస్తారు. జనరల్‌ ఇంగ్లిష్‌ తప్ప మిగతా ఆరు పేపర్లను మూడు భాషల్లో రాయొచ్చు. ఒక పేపర్‌ను ఒకే భాషలో రాయాలి. సగం పేపర్‌ను ఇంగ్లిష్‌, సగం పేపర్‌ను తెలుగు, ఉర్దూలో రాయడానికి అనుమతించరు.
క్వాలిఫైయింగ్‌ పేపర్‌ అయిన జనరల్‌ ఇంగ్లిష్‌ను ఎస్సెస్సీ సిలబస్‌ను అనుసరించి నిర్వహిస్తారు. ఓసీ, స్పోర్ట్స్‌ మెన్‌, ఈడబ్ల్యూఎస్‌ క్యాటగిరీ వారు 40 శాతం, బీసీలు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, వికలాంగ కోటా అభ్యర్థులు 30 శాతం మార్కులకు తగ్గకుండా సాధించాలి. ఈ మార్కులను ర్యాకింగ్‌ కోసం పరిగణనలోకి తీసుకోరు.

గ్రూప్‌-2: గ్రూప్‌-2కు సంబంధించి మొత్తం 600 మార్కులకు పరీక్ష ఉంటుంది. జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీ 150 మార్కులు, హిస్టరీ, పాలిటీ అండ్‌ సొసైటీ 150 మార్కులు, ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌ 150 మార్కులు, తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూలో ఉంటుంది.

ఉద్యోగం (విభాగం)
మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌ -3 (మున్సిపల్‌ అడ్మినిస్ట్రేటివ్‌)
అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ (కమర్షియల్‌ ట్యాక్స్‌)
డిప్యూటీ త‌హ‌సీల్దార్ (నాయబ్‌ తాసిల్దార్‌) (రెవెన్యూ)
సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌-2 (రిజిస్ట్రేషన్‌)
జూనియర్‌ ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ (ఎంప్లాయిమెంట్‌)
అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ (కోఆపరేటివ్‌)
అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ (కార్మిక శాఖ)
ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ (పంచాయతీ రాజ్‌)
సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎక్సైజ్‌)
ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-2 (పంచాయతీ రాజ్‌)
అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (సెక్రటేరియట్‌)
అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (అసెంబ్లీ)
అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (సెక్రటేరియట్‌ ఫైనాన్స్‌)
అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (సెక్రటేరియట్‌ (లా)

గ్రూప్ -3: గ్రూప్‌-3 పరీక్ష 450 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్‌1లో జనరల్‌ స్టడీస్‌ అండ్‌ అబిలిటీస్‌ 150 మార్కులు, పేపర్‌ 2లో హిస్టరీ, పాలిటీ అండ్‌ సొసైటీ 150 మార్కులు, పేపర్‌ 3లో ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌ 150 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి పరీక్ష రెండున్నర గంటల పాటు ఉంటుంది.

ఉద్యోగం (విభాగం)

సీనియర్‌ అకౌంటెంట్‌ (బీమా రంగం)
ఆడిటర్‌ (అకౌంట్స్‌)
సీనియర్‌ అకౌంటెంట్‌ (ట్రెజరీ)
సీనియర్‌ ఆడిటర్‌ (లోకల్‌ ఫండ్‌)
అసిస్టెంట్‌ ఆడిటర్‌ (అకౌంట్స్‌)
జూనియర్‌ అసిస్టెంట్‌ (హెడ్స్‌ ఆఫ్‌ డిపార్ట్‌మెంట్‌)
జూనియర్‌ అసిస్టెంట్‌ ( డైరెక్టరేట్‌ (ట్రెజరీ)
జూనియర్‌ అసిస్టెంట్‌ (బీమా రంగం)

గ్రూప్‌-4: వివిధ శాఖల్లోని జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అకౌంటెంట్స్‌ పోస్టులు ఈ క్యాటగిరీలోకి వస్తాయి. పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌, పేపర్‌-2 సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌ ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు ఉంటాయి. మొత్తం 300 మార్కులు. ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూ భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పరీక్షకు రెండున్నర గంటల సమయాన్ని కేటాయిస్తారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img