హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో రెండు టిమ్స్ ( తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ) దవాఖానల నిర్మాణాలకు సీఎం కేసీఆర్ మంగళవారం భూమి పూజ చేశారు. ఎల్బీనగర్ పరిధిలోని గడ్డి అన్నారంలో, సనత్ నగర్ పరిధిలోని ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేశారు.
కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కిషన్ రెడ్డి, జైపాల్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.