రచయిత్రి సత్యవీణకు అభినందనలు
అక్షరశక్తి, వరంగల్ : ప్రముఖ రచయిత్రి సత్యవీణ మొండ్రేటి రచించిన వీణానాదాలు పుస్తకావిష్కరణ సభ వరంగల్ నగరంలో ఘనంగా జరిగింది. వెనిశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హైదరాబాద్ మోడ్రన్ స్కూల్స్ డైరెక్టర్ సరోజినీ ముఖ్య అతిథిగా హాజరై సత్యవీణ ద్వితీయ గ్రంధం వీణానాదాలును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ… సత్యవీణ రచనలు సరళమైన భాషలో ఉంటాయని, సమాజంలోని స్థితిగతులకు అద్దంపడుతాయని అన్నారు. భవిష్యత్‌లో ఆమె మరిన్ని రచనలు చేయాలని, తన రచనలతో సమాజాన్ని మరింత జాగృతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా అతిథులు సత్యవీణను అభినందించారు. కార్యక్రమంలో హైకోర్టు పర్యవేక్షణ అధికారి అంజలి, హాస్యబ్రహ్మ శంకర్ నారాయణ, విశ్రాంత డీఈవో రాజేశం, అనంతపూర్ యూనివర్సిటీ విశ్రాంత ప్రిన్సిపాల్ నారాయణ దాసు తదితరులు పాల్గొన్నారు.
Must Read