Saturday, May 4, 2024

*నయీమ్ నగర్ పెద్ద మోరీ కూల్చుతున్న వేళ ట్రాఫిక్ మళ్ళింపు*

Must Read

అక్షరశక్తి, హన్మకొండ: నయీంనగర్ పెద్ద మోరీని కూల్చే ముహూర్తం తేదీ 05-04-2024 నాడు అధికారులు కూల్చివేసేందుకు ఏర్పాట్లు చేశారు మరియు దీని స్థానంలో రూ.8.5 కోట్లతో కొత్త బ్రిడ్జి నిర్మాణం చేయనున్నారు ఇందులో భాగంగానే (03) నెలలపాటు నయీం నగర్ రోడ్డు పై రాకపోకలు బంద్ కానున్నాయి. రోడ్డు ప్రయాణికులకు మరియు వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలుగ కుండా తేదీ 05-04-2024 నుండి (03) నెలల పాటు రాకపోకలు బంద్ కానున్నా నేపద్యంలో ఈ క్రింద తెలుపబడిన ట్రాఫిక్ నిబందనలు తీసుకోనైనది.

*1. కరీంనగర్ నుండి ఖమ్మం, నర్సంపేట, వరంగల్ వైపుకు వెళ్లవలసిన భారీ వాహనాలు కేయుసి జంక్షన్ నుండి పెగడపల్లిడబ్బాల, పెద్దమ్మ గడ్డ, ఆటోనగర్, మీదుగా వెళ్ళవలెను.*

*2. కరీంనగర్ నుండి వచ్చేటువంటి RTC బస్సులు కేయుసి జంక్షన్ నుండి పెగడపల్లిడబ్బాల, పెద్దమ్మ గడ్డ, ములుగు రోడ్డు జంక్షన్, అమృత జంక్షన్, హన్మకొండ చౌరస్తా మీదుగా బస్సాండ్ చేరుకోవలెను.*

*3. ఖమ్మం నుండి కరీంనగర్ వైపు వెళ్లవలసిన భారీ వాహనాలు ఉరుసుగుట్ట, కడిపికొండ, మడికొండ, ORR మీదిగా వెళ్ళవలెను.*

*4. వరంగల్, నర్సంపేట, వైపు నుండి కరీంనగర్ వైపుకు వెళ్లవలసిన భారీ వాహనాలు MGM ములుగు రోడ్డు జంక్షన్,పెద్దమ్మ గడ్డ, పెగడపల్లిడబ్బాల, కేయుసి జంక్షన్ మీదుగా వెళ్ళవలెను.*

*5. హన్మకొండ నుండి కరీంనగర్ వైపు వెళ్ళు RTC బస్సులు హన్మకొండ చౌరస్తా, అమృత జంక్షన్, ములుగు రోడ్డు జంక్షన్, పెద్దమ్మ గడ్డ, పెగడపల్లిడబ్బాల, కేయుసి జంక్షన్ మీదిగా వెళ్ళవలెను.*

ఇందుమూలంగా సమస్త ప్రయాణికులకు తెలియ జేయునది ఏమనగా ఇట్టిది ప్రజల సేవార్ధమై ఇచ్చినదిగా భావించి ప్రయాణికులకు అందరు ట్రాఫిక్ పోలీస్ సూచనలు పాటించి పైన తెలిపిన సరియగు ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రాయానించి పోలీసులకు సహకరించ గలరని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా నగర ప్రజలకు మనవి చేసారు.

పోలీస్ కమీషనర్, వరంగల్.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img