Monday, September 9, 2024

మావోయిస్టు పార్టీ టైల‌రింగ్ టీమ్‌ స‌భ్యురాలి లొంగుబాటు

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : ప్రభుత్వ సరెండర్ కమ్-రిహాబిలిటేషన్ పాలసీలో భాగంగా సీపీఐ (మావోయిస్ట్) పార్టీ సభ్యురాలు షేక్ చాంద్‌బీ అలియాస్ జ్యోత‌క్క(62) మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ ఎదుట మంగ‌ళ‌వారం లొంగిపోయారు. బుధ‌రావుపేట ప‌రిధిలోని మనుబోతలగడ్డకు చెందిన షేక్‌ చాంద్‌బీ సీపీఐ(మావోయిస్ట్) పార్టీ సిద్ధాంతాలతో విభేదించి, జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో క‌లిసింద‌ని ఎస్పీ తెలిపారు. షేక్ చాంద్‌బీ తొర్రూరు మండ‌లం హరిపిరాలలో జ‌న్మించింది. మూడేళ్ల వ‌య‌స్సులో ఖానాపూర్ మండ‌లం మనుబోతులగడ్డకు చెందిన ఆమె మేనత్త ఆమెను తీసుకువచ్చారు. ఆమె దివంగత ఆర్‌వైఎల్ న‌ర్సంపేట ఏరియా నాయ‌కుడు షేక్ ఇమామ్‌తో ప‌రిచ‌యం పెంచుకుంది. ఆ తర్వాత 1984-85లో షేక్ ఇమ్మామ్ రైలు ప్రమాదంలో మరణించాడు. ఆమె నర్సంపేటలో షేక్ ఇమామ్ తల్లిదండ్రుల వద్ద ఏడాదిపాటు ఉంది. త‌ర్వాత‌ 2004లో ఆమె ఛత్తీస్‌గఢ్‌కు మారి, సిపిఐ (మావోయిస్టు) పార్టీకి టైలరింగ్ టీమ్‌లో పని చేయడం ప్రారంభించింది. అయితే, ఆమె మావోయిస్టు భావజాలంతో విసుగు చెంది, లొంగిపోయిన‌ట్లు ఎస్పీ తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img