Tuesday, September 10, 2024

నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్

Must Read

 

అక్షరశక్తి, నర్సంపేట: వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమతలేని ఎంతోమంది నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంలా మారింద‌ని న‌ర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. న‌ర్సంపేట‌లో ల‌బ్ధిదారుల‌కు శ‌నివారం ఎమ్మెల్యే పెద్ది సీఎంఆర్ఎఫ్ చెక్కుల‌ను అంద‌జేశారు. ఈసంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పేద వర్గాల ప్రజలు అనారోగ్య కారణాలతో వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేసుకుని అప్పుల పాలుకాగా ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 95 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశామ‌న్నారు.

నర్సంపేట, వరంగల్ లేదా హైదరాబాద్ లో ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స తీసుకుని వాటికి సంబంధించిన బిల్లులతో సీఎం రిలీఫ్ ఫండ్ కింద దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఆర్థిక సహాయాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంద‌న్నారు. రాష్ట్రవ్యాప్తంగా సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు విషయంలో నర్సంపేట నియోజకవర్గం మూడో స్థానంలో ఉంద‌న్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత నర్సంపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకూ సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 45 కోట్ల రూపాయల పైచిలుకు చెక్కులను అందించామ‌ని ఆయ‌న తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img