Tuesday, June 18, 2024

రైతుల భూములు లాక్కున్నోళ్ళు రైతుల కోసం సభ పెట్టడం విడ్డూరం..

Must Read

వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : రైతుల భూములు లాక్కున్నోళ్ళు రైతుల కోసం సభ పెట్టడం విడ్డూర‌మ‌ని
వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం హ‌న్మ‌కొండ‌లో విలేక‌రుల‌తో మాట్లాడారు. రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అవుతారని కాంగ్రెస్ ఊహించుకుంటోంద‌ని, చిన్న గ్రౌండ్‌లో సభ పెట్టి పెద్ద బిల్డప్ ఇచ్చార‌ని, జనం రాక బొక్కబోర్లా పడ్డార‌ని అన్నారు. తెలంగాణ కోసం ఉద్యమించి జైలుకు వెళ్లిన వ్యక్తి కేటీఆర్ అని, దొంగ పనులు చేసి జైలుకు వెళ్లిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని విమ‌ర్శించారు. రేవంత్‌రెడ్డి నీతులు చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంద‌న్నారు. భూములు లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వ్యక్తి పీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్నాడ‌ని. చంద్రబాబు ఎజెండా మోసేందుకు ఇక్కడ దనసరి అనసూయ, రేవంత్ కాంగ్రెస్‌లో పనిచేస్తున్నార‌న్నారు. ములుగులో పోడు భూములపై దందా, గుడిసెలు ఎలా తగలబడ్డాయో త్వరలో భయటపడుతుంద‌న్నారు. నక్సలిజం నుండి వచ్చి ఆ సిద్దాంతాలు మంటలో కలిపి, బూర్జువాను మించిన అవినీతి పార్టీలో చేరిన ములుగు ఎమ్మెల్యే సీత‌క్క మాఫియా చరిత్ర త్వ‌ర‌లోనే భయటపెడతామ‌ని అన్నారు. ఈ విలేక‌రుల స‌మావేశంలో వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్‌భాస్క‌ర్‌, వ‌ర్ధ‌న్న‌పేట ఎమ్మెల్యే అరూరి ర‌మేశ్‌, మేయ‌ర్ గుండు సుధారాణి , కుడా చైర్మ‌న్ సుంద‌ర్‌రాజ్ త‌దిత‌రులున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img