Friday, September 13, 2024

కేటీఆర్‌..నోరు అదుపులో పెట్టుకో..

Must Read
  • నీది రాహుల్‌ను విమ‌ర్శించే స్థాయా..?
  • ఆస్తులు, అధికారమే మీ కుటుంబ నేపథ్యం
  • రాహుల్‌గాంధీది దేశభక్తి, త్యాగాల చ‌రిత్ర

అక్షరశక్తి, మహబూబాబాద్ : టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాల‌ని, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విమ‌ర్శించే స్థాయి, నైతిక‌త కేటీఆర్‌కు లేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ ఆదివాసీ సంఘ్ ఉపాధ్యక్షులు బెల్లయ్య నాయక్ అన్నారు. మానుకోట జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఆదివారం నిర్వ‌హించిన విలేకరుల స‌మావేశంలో మాట్లాడారు. కేటీఆర్ పై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. పార్టీ న‌ష్ట‌పోతుంద‌ని తెలిసి ఆ రోజు సోనియాగాంధీ సాహోసోపేతంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింద‌ని, ఆమె ద‌య వ‌ల్లే నీ అయ్య ముఖ్య‌మంత్రి అయ్యాడ‌ని, నీ కుటుంబం మొత్తం మంత్రులు అయ్యారన్న విష‌యాన్ని కేటీఆర్ గుర్తించాల‌న్నారు. ఆస్తులు, అధికారమే ధ్యేయంగా మాటలగారడీతో ప‌బ్బం గడుపుకునే నీకు.. దేశంకోసం ప్రాణత్యాగాలు చేసిన రాహుల్ గాంధీ కుటుంబాన్ని విమ‌ర్శించే స్థాయి ఎక్క‌డిద‌న్నారు. నీ అయ్య కేసీఆర్‌.. సిరిసిల్లలో కేకే మహేందర్‌రెడ్డిని రాజకీయంగా గొంతు నులిమి నీకు రాజకీయ భవిష్యత్తు నిచ్చాడన్నారు. తెలంగాణా ఉద్యమంలో మీ నాయనను తిరుగకుండా నువ్వు టార్చర్ చేసిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందేన‌ని, అస‌లు నీకు ఉద్యమ నేపథ్యమే లేద‌ని ఫైర్ అయ్యారు. పవర్ ప్రాజెక్టుల్లో వాటా…? కాంట్రాక్ట్‌ల‌ల్లో వాటా.. ప్రభుత్వం భూములు అక్రమంగా రెగ్యులరైస్ చేయడం వాస్తవం కదా అని ప్ర‌శ్నించారు. సాయంత్రం కాగానే ఆంధ్ర కాంటాక్ట‌ర్లతో మీటింగ్ లు పెట్టడం నిజం కదా అన్నారు. ఓరుగ‌ల్లు రాహుల్ సభతో నీకు, నీ అయ్య‌కు మైండ్ దొబ్బింద‌ని, అందుకే ఆగంఆగం అవుతున్నార‌ని అన్నారు. ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణం ఇచ్చింద‌ని, ఆమె కొడుకు రాజీవ్ గాంధీ తీవ్రవాదుల చేతిలో బల‌య్యాడ‌ని గుర్తుచేశారు. మూడుసార్లు ప్రధానిగా అవకాశం వ‌చ్చిన‌ప్ప‌టికీ సోనియాగాంధీ ప‌ద‌వులు వ‌దులుకున్నార‌ని అన్నారు. అలాంటి కుటుంబాన్నివిమ‌ర్శించ‌డం కేటీఆర్ అహంకారానికి, అవివేకానికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు. కల్వకుంట్ల కుటుంబం టక్కరి మాటలు తెలంగాణ ప్రజలు నమ్మర‌ని, ప్రజా ధనాన్ని కొల్లగొట్టి ఆస్తులు కూడ‌గట్టుకున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రానున్నది కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్య‌క్షుడు జెన్నారెడ్డి భ‌రత్ చందర్ రెడ్డి, నియోజకవర్గ సీనియర్ నాయకులు డాక్టర్ మురళీనాయ‌క్‌, జిన్నారెడ్డి వెంకటేశ్వ‌ర్లు, హరినాయక్, ప్రసాద్ నాయక్, ఖలీల్, నిరుటి సురేశ్‌, భాస్కర్ సాయితేజ, భూక్యా శ్రీను తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img