Sunday, September 8, 2024

పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తా..

Must Read

పీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ రాష్ట్ర క‌న్వీన‌ర్‌,
ద‌ళిత కాంగ్రెస్ మ‌హిళా విభాగం రాష్ట్ర ఇన్‌చార్జి
కూరాకుల భార‌తి
అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి త‌న వంతు కృషి చేస్తాన‌ని టీ పీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ రాష్ట్ర క‌న్వీన‌ర్‌, ద‌ళిత కాంగ్రెస్ మ‌హిళా విభాగం రాష్ట్ర ఇన్‌చార్జి (విశ్రాంత లేబ‌ర్ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్) కూరాకుల భార‌తి అన్నారు. టీ పీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ రాష్ట్ర క‌న్వీన‌ర్‌గా, ద‌ళిత కాంగ్రెస్ మ‌హిళా విభాగం రాష్ట్ర ఇన్‌చార్జిగా నియ‌మితులైన సంద‌ర్భంగా భార‌తి శ‌నివారం విలేక‌రులతో మాట్లాడారు. అంకిత‌భావంతో ప‌నిచేస్తూ ఎస్సీ డిపార్ట్‌మెంట్‌ను గ్రామ‌స్థాయి నుంచి నిర్మాణం చేస్తాన‌ని, కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్తాన‌న్నారు. కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేస్తూనే పార్టీ పూర్వ వైభ‌వానికి త‌న వంతు కృషి చేస్తాన‌ని అన్నారు.

ఈసంద‌ర్భంగా త‌న నియామ‌కానికి స‌హ‌క‌రించిన టీ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి, ఎస్సీ డిపార్ట్‌మెంట్ రాష్ట్ర చైర్మ‌న్ నాగ‌రిగారి ప్రీతం, ఆల్ ఇండియా మ‌హిళా కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ములుగు ఎమ్మెల్యే సీత‌క్క‌, టీ పీసీసీ ఉపాధ్య‌క్షులు వేం న‌రేంద‌ర్‌రెడ్డి, హ‌న్మ‌కొండ డీసీసీ అధ్య‌క్షుడు నాయిని రాజేంద‌ర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దొంతి మాధ‌వ‌రెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజ‌య్య‌, మాజీ మేయ‌ర్ ఎర్ర‌బెల్లి స్వ‌ర్ణ‌, మాజీ డీసీసీబీ చైర్మ‌న్ జంగా రాఘ‌వ‌రెడ్డి, గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ కార్పొరేట‌ర్ పోతుల శ్రీమాన్‌, జిల్లా మ‌హిళా కాంగ్రెస్ అధ్య‌క్షురాలు బంక స‌ర‌ళ‌, వ‌ర్ధ‌న్న‌పేట కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి న‌మిండ్ల శ్రీనివాస్‌, హ‌న్మ‌కొండ ఎస్సీ డిపార్ట్‌మెంట్ చైర్మ‌న్ డాక్ట‌ర్ పెరుమాండ్ల రామ‌కృష్ణ‌, ఎస్సీ డిపార్ట్‌మెంట్ రాష్ట్ర క‌న్వీన‌ర్ అర్షం అశోక్‌తోపాటు స్థానిక జిల్లా, రాష్ట్ర స్థాయి నాయ‌కులంద‌రికీ భార‌తి కృత‌జ్క్ష‌త‌లు తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img