Saturday, July 27, 2024

నిరుద్యోగుల‌కు అల‌ర్ట్ ! ఎన్పీడీఎస్‌లో ఉద్యోగాల‌కు నోటిఫికేషన్‌ విడుదల..

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : వరంగల్‌ కేంద్రంగా పని చేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (TSNPDCL) జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు.
జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్
పోస్టులు: 100
విద్యుత్‌ సర్కిళ్లు:
వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌.
అర్హత : ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి.
వయసు : అభ్యర్థుల వయసు 2023 జనవరి 1వ తేదీ నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక విధానం: రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా..
రాత పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌లోని పలు కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : రూ.200 (ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ, పీహెచ్‌సీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది).
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ఫీజు ప్రారంభ తేదీ: ఏప్రిల్‌ 10, 2023
దరఖాస్తులు ప్రారంభతేదీ: ఏప్రిల్‌ 10, 2023
దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: ఏప్రిల్‌ 29, 2023 (సాయంత్రం 5 గంటల వరకు)
దరఖాస్తులకు చివరి తేదీ : ఏప్రిల్‌ 29, 2023 (రాత్రి 11:59 వరకు)
దరఖాస్తుల ఎడిట్‌ ఆప్షన్‌ : 2023 మే 2 నుంచి 5వ తేదీ వరకు ఉంటుంది.
హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ తేదీ : మే 22, 2023
పరీక్ష తేదీ : మే 28, 2023
వెబ్‌సైట్‌ :https://tsnpdcl.in

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img