అక్షరశక్తి, హన్మకొండ క్రైం : వరంగల్ కాశీబుగ్గ నరేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద అమ్మాయిలను కొందరు ఆకతాయిలు ఏడిపిస్తున్నారన్న సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం వరంగల్ షీ టీం మెరుపు దాడి చేసింది. 12 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని తమదైన శైలిలో షీటీం బృందం విచారిస్తోంది. ఈ మెరుపు దాడిలో ఏసీబీ, సీఐ బృందం పాల్గొన్నారు.