మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా జీవించడానికి ప్రకృతి వైద్యనిపుణులు డాక్టర్ చిలువేరు సుదర్శన్ అనేక చిట్కాలు చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా నీటితోనే అన్నిరోగాలు నమమవుతాయని అంటున్నారు. ఇందులో మీకోసం కొన్ని చిట్కాలు
- మలబద్ధకం నివారణకు మంచినీరు బాగా తాగాలి
- అజీర్ణం చేసినప్పుడు గోరువెచ్చని నీరు తాగాలి
- శరీరంలో వేడిచేసినప్పుడు చల్లనినీరు బాగా తాగాలి. నీటిలో కూర్చోవాలి.
- కండరాలు, కీళ్లు నొప్పిగా ఉన్నప్పుడు వేడినీటితో కాపుకోవాలి
- పొట్టలో గ్యాస్ ఉన్నప్పుడు వేడినీళ్లు తాగాలి.
- పొట్టలో నొప్పి ఉన్నప్పుడు వేడినీటిలో నిమ్మరసం పిండుకుని తాగాలి
- తలనొప్పి ఉన్నప్పుడు తలను చన్నీటితో కడగాలి. లేదా నుదుటిమీద తడిగుడ్డ వేయాలి.
- మధుమేహ రోగులు నీరుబాగా తాగాలి.
- మూత్రపిండ వ్యాధుల నివారణకు మంచినీరే దివ్యమైన ఔషధం.
- చర్మం నిగనిగలాడాలంటే మంచినీరు బాగా తాగాలి.
- కోపంగా ఉన్నప్పుడు రెండు గ్లాసులు మంచినీరు తాగండి.
- తలనొప్పిగా ఉన్నప్పుడు మంచినీరు తాగండి.
- భయంభయంగా ఉన్నప్పుడు మంచినీరు తాగండి.