అక్షరశక్తి, హైదరాబాద్ : అసెంబ్లీ సాక్షిగా 80,039 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించి నోటిఫికేషన్ల విషయంలో తాత్సారం చేస్తున్న సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. మిగతా 63,425 పోస్టుల భర్తీకి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారని ప్రశ్నించారు. 8 యేండ్ల టీఆర్ ఎస్ పాలనలో కేవలం పోలీస్ ఉద్యోగాలే భర్తి చేస్తున్నారని ఇతర ఉద్యోగాలను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. నియంతృత్వ పాలనకు అడ్డు రాకూడదనే ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారన్నారు. విద్యా సంవ్సతరం ఇంకా రెండు నెలల్లో ప్రారంభం అవుతుందని జూన్ 12న టెట్ పరీక్ష నిర్వహిస్తే ఉపాధ్యాయ పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారని ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసే లోపు విద్యా సంవత్సం సగం పూర్తవుతుందని తెలిపారు. వెంటనే ఉపాధ్యాయుల భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరారు. ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చి ఇంత వరకు వారిని విధుల్లోకి తీసుకోలేదని పేర్కొన్నారు. ప్రతి నిరుద్యోగికి రూ. రూ. 1.20లక్షలు ఇవ్వాలని, మిగతా ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే నిరుద్యోగులకు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.