Saturday, July 27, 2024

మత సామరస్యానికి ప్రతీకగా టీఆర్ఎస్ పాల‌న

Must Read
  • వ‌ర్థ‌న్న‌పేట ఎమ్మెల్యే ఆరూరి ర‌మేశ్
    అక్ష‌ర‌శ‌క్తి, హ‌స‌న్‌ప‌ర్తి: మత సామరస్యానికి ప్రతీకగా టీఆర్ ఎస్ ప్ర‌భుత్వ పాల‌న కొన‌సాగుతుంద‌ని వ‌ర్థ‌న్న‌పేట ఎమ్మెల్యే ఆరూరి ర‌మేశ్ అన్నారు. పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని నిరుపేద ముస్లింలకు హాసన్ పర్తి మండలం ఎర్రగట్టు గుట్ట వద్ద గ‌ల ఎంఎస్ ఆర్‌ గార్డెన్స్ లో తెలంగాణ ప్రభుత్వం కానుక‌గా అందిస్తున్న బట్టలను మంగ‌ళ‌వారం పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ మండల పరిధిలోని 400మంది పేద ముస్లిం కుటుంబాలకు బట్టల పంపిణీ చేసినట్లు తెలిపారు. తెరాస ప్రభుత్వం అన్ని మతాల పండుగలను పురస్కరించుకుని పేద ప్రజానీకానికి ప్రభుత్వ కానుక అందించడం జరుగుతుందన్నారు.  అన్ని వర్గాలకు ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని మత సామరస్యానికి ప్రతీకగా నిలిపే లక్ష్యంలో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. అనంతరం మండలానికి మండలానికి చెందిన 146 మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు కోటి 46లక్షల 16వేల 936రూపాయల విలువగల చెక్కులను, అలాగే 32మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 25లక్షల 88వేల 400రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img