Saturday, July 27, 2024

మద్యంప్రియులకు షాక్‌!

Must Read

భారీగా పెరగనున్న బీర్ల ధరలు

ఇప్పటికే అన్ని నిత్యావ‌సరాల ధరలు మండిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, వంట నూనె, కూరగాయలు, ఆహార పదార్థాలు.. ఇలా అన్ని సరుకుల ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయి. అయితే.. ఇప్పుడు బీర్ల ధరలు కూడా భారీగా పెరనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే బీర్ల రేటు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముడి సరుకు ధరలు పెరగడం వల్లే బీర్ల ధరలు పెంచాలని.. లేదంటే నష్టాలు తప్పవని బీర్ల తయారీ కంపెనీలు భావిస్తున్నాయి. ఈనేప‌థ్యంలోనే బీర్ల రేటును 10 నుంచి 15 శాతం మేరకు పెంచాలని బీర్ల తయారీ కంపెనీలు నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. బీర్ల తయారీలో వాడే బార్లీ, ఇతర ముడి సరుకుల ధరలు పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

బీర్ల తయారీలో కీలకమైన బార్లీ ధర గత ఏడాది కాలంలో ఏకంగా 65 శాతం మేర పెరిగింది. దీనికి తోడు రవాణా, ప్యాకేజింగ్ ఖర్చులు పెరిగాయి. ఈ క్రమంలోనే బీర్ల ధరలను పెంచక తప్పడం లేదని కంపెనీల ప్ర‌తినిధులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల ధరలను పెంచినట్లు తెలిపారు. ప్రతి ఏటా వేసవిలో బీర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఏడాది మొత్తం అమ్మకాల్లో 40 నుంచి 45 శాతం.. మార్చి నుంచి జూన్ మధ్యే ఉంటుంది. ఒకవేళ ధరలను పెంచితే అమ్మకాలు తగ్గుతాయన్న ఆందోళన కూడా కంపెనీలు వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం లైట్ బీర్ ధర రూ.140, స్ట్రాంగ్ బీర్ ధర రూ.150గా ఉంది. బీర్ల కంపెనీలు ధరలు పెంచితే.. మరో రూ.20 అదనంగా పెరిగే అవకాశముంది. అంటే లైట్ బీర్ ధర రూ.160, స్ట్రాంగ్ బీర్ ధర రూ.170కి చేరుకోవచ్చు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img