Tuesday, September 10, 2024

చాంద్‌బీకి రూ.8లక్షల రివార్డ్ చెక్కు అంద‌జేత

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : సీపీఐ మావోయిస్టు పార్టీలో ప‌నిచేసి, గ‌త మార్చిలో జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో క‌లిసిన షేక్ ఇమాంబీ(చాంద్‌బీ) అలియాస్ జ్యోతక్క( మనుబోతలగడ్డ – బుధరావుపేట)కు ప్రభుత్వ సరెండర్ కమ్-రిహాబిలిటేషన్ పాలసీలో భాగంగా మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ రూ.8 లక్షల రివార్డ్ చెక్కును జిల్లా పోలీస్ కార్యాలయంలో అందించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ…ప్రభుత్వం అమ‌లు చేస్తున్న‌ సరెండర్-కమ్-పునరావాస విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని, జ‌నజీవన స్రవంతిలో చేరాలని మావోయిస్టుల‌ను కోరారు. సమాజంలో శాంతియుత జీవితాన్ని గడపడానికి అన్నిర‌కాలుగా సహాయ సహకారాలు అందిస్తామ‌ని ఎస్పీ తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img