Tuesday, September 10, 2024

జీవో 46 బాధితులతో మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన రాకేష్ రెడ్డి

Must Read

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: తెలంగాణ సెక్రటేరియట్ లో జీవో 46 బాధితులతో మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన ఏనుగుల రాకేష్ రెడ్డి. మాజీ మంత్రి కేటీఆర్ సూచ‌న మేర‌కు రాష్ట్ర మంత్రితో చర్చించడానికి, బాధితులతో కలిసి బృందంగా వేళ్లారు. జీవో 46 వల్ల కలుగుతున్న నష్టం పై మంత్రికి వినతి ప‌త్రం అందించారు. జీవొ 46 ను రద్దు చెయ్యడం, న్యూమరికల్ పోస్ట్ లతో న్యాయం చెయ్యడం పై మంత్రితో సమాలోచన చేశారు.

జీవో 46 వల్ల నష్టపోతున్న గ్రామీణ విద్యార్ధుల పై మంత్రికి వివ‌రించాగా మంత్రి సావధానంగా విన్నరు. అయితే జీవో 46 రద్దు పై శాసనసభ వేసిన సబ్ కమిటీ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మెంబ‌ర్ గా ఉన్నరు. మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని హామీ ఇచ్చి, శాసనసభ సబ్ కమిటీలో చర్చిస్తామని, అన్నారు. మంత్రిని కలిసిన సందర్భంగా జీవో 46 బాధితులు తమ గోడును వెళ్ళబోసుకున్నరు. రాజకీయ భేషజాలకు పోకుండా జీవో 46 రద్దుకు సంపూర్ణంగా సహకరించాలని, ఈ విషయం పై అసెంబ్లీ లో అలాగే శాసనసభ సబ్ కమిటీ లో చర్చించాలని, అవసరమైతే మళ్ళీ వచ్చి సవివరంగా వివరిస్తామని, సాంకేతిక సమస్యల పై సమాలోచన చెయ్యడానికి సిద్ధమని, ఎటువంటి పత్రాలు సమకూర్చడానికి అయిన సిద్ధఅని, ఈ నెల 19న జీవో 46 పై హైకోర్టు లో జరిగే విచారణకు ప్రభుత్వ తరుపు అడ్వకేట్ జనరల్ హాజరయ్యేలా సిఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని రాకేష్ రెడ్డి అన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img