Monday, September 9, 2024

ఇంటింటి సర్వేతోనే కొవిడ్‌కు చెక్

Must Read

జ‌న‌గామ జిల్లా క‌లెక్ట‌ర్ శివ‌లింగ‌య్య‌
హైద‌రాబాద్ నుంచి మంత్రుల వీడియో కాన్ఫ‌రెన్స్‌

అక్ష‌ర‌శ‌క్తి, జ‌న‌గామ : ఇంటింటి సర్వేను పటిష్టంగా చేపట్టి పక్క ప్రణాళికతో క‌రోనా వైర‌స్‌ను అడ్డుకుంటామ‌ని జ‌న‌గామ‌ జిల్లా కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య అన్నారు. గురువారం కొవిడ్ ను అరికట్టేందుకు చేపడుతున్న కార్యక్రమాలపై హైదరాబాద్ నుంచి రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ ఆధ్వర్యంలో రాష్ట్ర వైద్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావులు వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ల‌తో సమీక్షించారు.

ఈ సందర్భంగా జ‌న‌గామ జిల్లా క‌లెక్ట‌ర్‌ కలెక్టర్ శివ‌లింగ‌య్య మాట్లాడుతూ.. జిల్లాలో క‌రోనా వైర‌స్‌ను అడ్డుకునేందుకు చేప‌డుతున్న చ‌ర్య‌ల‌పై వివ‌రించారు. గ్రామాల్లో వైద్య, పంచాయతీ, మున్సిపాలిటీ సిబ్బందితో బృందాలు ఏర్పాటు చేసి ఇంటింటి సర్వేతోనే కొవిడ్ కు చెక్ పెడతామన్నారు. ప్రతి ఒక్కరినీ పలకరించి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని వైద్యం అందిస్తామన్నారు. జిల్లాలోని 12 పీహెచ్‌సీలు( ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు) 4 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్ లోనూ ఓపీ పెంచుతూ కరోనా లక్షణాలున్న వారికి కిట్స్ అందిస్తామన్నారు. ఎంసీహెచ్‌లో ఐసోలేషన్ బ్లాక్ ను ఏర్పాటు చేశామన్నారు.

అనంతరం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచేందుకు కొవిడ్ నిర్దారణ కాగానే తక్షణం మందుల కిట్ అందజేయాలన్నారు. నియంత్రణ కు తీసుకోవలసిన చర్యలను వివరిస్తూ…ప్రతిరోజు ఒకసారి అయినా పలకరించి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని వైద్యం అందిస్తూ ఆరోగ్యం కుడుటపడేంత వరకు సహకారం అందించాలన్నారు. మందులకు కొదవలేదని 10 లక్షలు విలువజేసే మందులను జిల్లాలకు పంపించామ‌న్నారు.

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ కొవిడ్ నియంత్రణ లో డోర్ టు డోర్ సర్వే తోనే రాష్ట్రానికి మంచి పేరు వచ్చిందని, నీతి ఆయోగ్ రాష్ట్రాన్ని కొనియాడిందని, గతంలో మాదిరిగానే ఇంటింటి సర్వే చేపట్టి కోవిడ్ ను నియంత్రించాలన్నారు.

రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ జనవరి నెలాఖరులోగా అధికారులు సమన్వయంతో కొవిడ్‌ను నియంత్రించాలని, గణతంత్ర వేడుకలను సాధారణంగా కొద్ది మందితో నిర్వహించాలని కలెక్టర్లకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జిల్లా వైద్యాధికారి మహేందర్, ఉప వైద్యాధికారి కరుణశ్రీ, ప్రభుత్వ ఆస్ప‌త్రి పర్యవేక్షకులు సుగుణాకర్ పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img