Saturday, July 27, 2024

నేటి నుంచి పంట న‌ష్టం స‌ర్వే

Must Read

రాజ‌కీయాల‌కు అతీతంగా స‌ర్వేకు స‌హ‌క‌రించాలి
త్వరగా సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించాలి
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

అక్షరశక్తి, నర్సంపేట : ఇటీవల నర్సంపేట నియోజకవర్గంలో కురిసిన భారీ వడగండ్ల వర్షానికి పంట పొలాలకు, ఇండ్లకు భారీగా నష్ట వాటిల్లిన విషయం విదితమే. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డి వెంటనే వారికి జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నష్టపోయిన రైతులను ఆర్థికంగా ఆదుకొని, వారికి ప్రభుత్వం నుండి నష్టపరిహారాన్ని అందచేయాలని కోరుతూ మూడు రోజుల క్రితం సీఎం కేసీఆర్‌కి జిల్లా మంత్రులతో, ఎమ్మెల్యేలతో కలిసి వినతి పత్రాన్ని అంద‌జేశారు.

ఫలితంగా కేసీఆర్ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కదలివచ్చి నియోజకవర్గంలోని దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతుల వారీగా తుది సర్వేను నిర్వహించి రానున్న మూడు రోజుల్లో తుది నివేదికను సమర్పించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నేటి నుంచి ఆ స‌ర్వే ప్రారంభం కానుంది. రాజకీయలకతీతంగా సర్వే చేసే అధికారులకు రైతులు సహకరించాలని ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే పెద్ది కోరారు. సర్వే చేసిన వివరాలను సంబంధిత గ్రామ పంచాయతీ ఎదుట‌ ప్రత్యక్షపర్చాలని, రైతుల నుండి అభ్యర్ధనలను స్వీకరించాలని సూచించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img