Saturday, July 27, 2024

కేసీఆర్‌కు శుభాకాంక్ష‌ల వెల్లువ‌

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : 68వ వసంతంలోకి అడుగుపెట్టిన టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు వెల్ల‌వెత్తుతున్నాయి. ఫిబ్రవరి 17 కేసీఆర్ జ‌న్మ‌దినం సందర్భంగా చంద్ర‌శేఖ‌ర్‌రావుకు ప‌లువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ, గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై, ఏపీ సీఎం జ‌గ‌న్‌, కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్‌, సినీ న‌టులు నాగార్జున‌, మ‌హేశ్‌బాబు, రోజా కేసీఆర్​కు బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు.

చంద్ర‌బాబు విషెస్‌..

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ట్విట్ట‌ర్‌లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సదా ఆనంద ఆరోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను’ అంటూ చంద్ర‌బాబు ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కి న‌ల్ల‌గొండ కాంగ్రెస్​ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతోపాటు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను అని ఆకాక్షించారు. మంత్రి హరీశ్​ కూడా కేసీఆర్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్‌ సీఎం అయ్యాకే తెలంగాణ తలరాత మారింది, ఆయన నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకెళ్తోందని సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌ జన్మదినం తెలంగాణకు పండుగరోజ‌ని, ఆయ‌న నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలంటూ హ‌రీశ్ ట్వీట్ చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img