అక్షరశక్తి, జనగామ : ఈ నెల 11న జనగామ జిల్లా కేంద్రానికి సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో నిర్వహించే బహిరంగ సభా స్థలాన్ని గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా జనగామ పార్టీ కార్యాలయాన్ని వారు పరిశీలించారు. అలాగే పార్టీ కార్యాలయం సమీపంలో నిర్వహించనున్న బహిరంగ సభా స్థలాన్ని పరిశీలించి, పలు సలహాలు, సూచనలు చేశారు.
Previous article
Latest News