Tuesday, June 18, 2024

బ్రేకింగ్ న్యూస్‌… రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య అరెస్టు

Must Read

అక్షరశక్తి, హన్మకొండ క్రైం : పోలీస్ శాఖలో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి భూమయ్యను సోమవారం హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు భూమయ్యను అరెస్టు చేస్తున్నట్లు ఆయన భార్యకు సమాచారం ఇచ్చారు. కానిస్టేబుల్ జైపాల్ రెడ్డి ఫిర్యాదు మేరకు భూమ‌య్య‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని వివరించినట్లు స‌మాచారం. అయితే ఆయనకు నోటీసులు ఇచ్చి వదిలివేస్తారా…? అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా దాసరి భూమయ్యపై అరెస్ట్ మాత్రం కరీంనగర్ జిల్లాలో కలకలం రేపింది.
పోలీసు శాఖలో పదవీ విరమణకు ముందు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఏసీబీ అధికారులు చేసిన సోదాల్లో భూమ‌య్య కారులో నగదుతో పట్టు పడగా ఆ మొత్తాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఆయనపై కేసు నమోదు కాలేదు. ఇక హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో తుపాకుల మాయం విషయంలోనూ పోలీసు ఉన్నతాధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. అయితే అవి దొరకడంతో ఆ విషయం అంతటితోనే సద్దుమణిగిపోయింది. పదవీ విరమణ తర్వాత భూమయ్య కాంగ్రెస్ పార్టీలో చేరి కొంతకాలం క్రియాశీలకంగా పని చేశారు. అనంతరం తీన్మార్ మల్లన్న టీంలో చేరి రాష్ట్ర కన్వీనర్‌గా పని చేస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో అధికార పార్టీ నుండి వచ్చిన ఒత్తిళ్ళ మేరకు ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. తీన్మార్ మల్లన్న బీజేపీకి మద్దతుగా ఉన్నారన్న కారణంగా కొంతకాలం మల్లన్న టీం నుండి వైదొలిగారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img