ఏటూరునాగారంలో కలకలం
అక్షరశక్తి, వరంగల్ : ఏటూరునాగారంలోని ఐటీడీఏ ఏఈ, డీఈలు ఏసీబీ వలకు చిక్కారు. ఏఈగా విధులు నిర్వర్తిస్తున్న హబిద్‌ఖాన్, డీఈగా విధులు నిర్వర్తిస్తున్న నవీన్‌కుమార్‌లు రూ.50వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబట్టారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం 6గంటల సమయంలో ఐటీడీఏ కార్యాలయంలో చోటుచేసుకుంది. మేడారం ఆలయ కాంట్రాక్టు పనులు చేసిన వారికి చెల్లించాల్సిన రూ.16లక్షల చెక్కు విడుదల చేయడానికి ఏఈ, డీఈలు రూ.50వేల లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి అవినీతి అధికారుల భరతం పట్టారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఐటీడీఏలో కలకలం రేగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Must Read