Tuesday, September 10, 2024

టెన్ష‌న్ .. టెన్ష‌న్ !

Must Read
  • రెండోసారి ఈడీ ముందుకు క‌విత‌
  • ఢిల్లీలో తెలంగాణ మంత్రులు, ఎంపీలు
  • కేసీఆర్ నివాసం దగ్గర 144 సెక్షన్
  • ఎటువంటి ఆదోళనలు జరగకుండా పోలీస్ బందోబస్తు

ఢిల్లీలో రాజకీయం మరోసారి వేడెక్కింది. ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె క‌ల్వ‌కుంట్ల కవిత మరోసారి ఈడీ విచారణకు హాజరుకానుండటంతో టెన్ష‌న్ వాతావ‌ర‌ణ నెల‌కొంది. కవితకు మద్దతుగా తెలంగాణ మంత్రులు, ఎంపీలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా హ‌స్తిన‌లోనే మ‌కాంవేసి ఎప్పటికప్పుడు పరిణామాలను గమనిస్తున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు కవితను ఈడీ విచారించనుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత ఈడీ ఎదుట హాజరు కావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. మార్చి 11న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కవితను తొలిసారి విచారించింది. దాదాపు 9 గంటల పాటు విచారణ సాగింది. ఇక.. కవితకు సంబంధించిన ఇవాల్టి ఈడీ విచారణ విషయానికొస్తే.. రామ‌చంద్ర పిళ్లైతో కలిపి కవితను ఈడీ ప్రశ్నించ‌నుంది. అదే విధంగా బుచ్చిబాబును కూడా ఈడీ విచారణకు పిల‌వ‌డం గ‌మ‌నార్హం. ఈక్ర‌మంలోనే క‌విత‌ను ఇవాళ అరెస్ట్ చేసే అవ‌కాశం ఉంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో ఢిల్లీలో ఎటువంటి ఆందోళ‌న‌లు జ‌ర‌గ‌కుండా పోలీస్‌లు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. తుగ్ల‌క్ రోడ్డులోని సీఎం కేసీఆర్ నివాసం దగ్గర 144 సెక్షన్ విధించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img