Saturday, July 27, 2024

లా విద్యార్థినిపై లైంగిక‌దాడి

Must Read

ఎమ్మెల్యే పీఏతోపాటు మ‌రో ఇద్ద‌రి అరెస్ట్
న‌గ‌రంలో క‌ల‌క‌లం
అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వ‌రంగ‌ల్‌లో దారుణం జ‌రిగింది. న‌గ‌రంలోని ఓ క‌ళాశాల‌లో ఎల్ఎల్‌బీ చదువుతున్న విద్యార్థిని (23)పై ఇద్ద‌రు యువకులు లైంగిక‌దాడికి పాల్ప‌డ్డారు. నిందితుల్లో ఎమ్మెల్యేకు చెందిన‌ పీఏ ఉండ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు… సిద్దిపేట జిల్లాకు చెందిన విద్యార్థిని హ‌న్మ‌కొండ‌లోని ఓ క‌ళాశాల‌లో ఎల్ఎల్‌బీ ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దువుతోంది. త‌న‌పై లైంగిక‌దాడి జ‌రిగింద‌ని బుధ‌వారం పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు విచార‌ణ జ‌రిపి ము గ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఎమ్మెల్యే పీఏ ఉండ‌టం క‌ల‌కంరేపుతోంది. ఎమ్మెల్యే పీఏతోపాటు అత‌డి స్నేహితుడు, హాస్ట‌ల్ నిర్వాహ‌కురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img