అక్షరశక్తి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం ఎస్సై ఉదయ్ కిరణ్ సస్పెండ్ అయ్యారు. గణపురం మండల కేంద్రంలోని ఓ బైక్ షోరూం దగ్గర ఎన్వోసీ విషయంలో ఈనెల 11న యజమానికి, కస్టమర్లకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో యజమాని పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు ప్రశాంత్, శ్రావణ్ అనే ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. అయితే.. ప్రశాంత్ అనే వ్యక్తిని ఎస్సై ఉదయ్ కిరణ్ అకారణంగా చితకొట్టాడని బంధువులు, కుటుంస సభ్యులు ఆరోపించారు.
ఈక్రమంలోనే తీవ్ర మనస్థాపానికి గురైన ప్రశాంత్. పోలీస్ స్టేషన్ ముందే ఈనెల 12న పురుగుల మందు తాగాడు. దవాఖానలో చికిత్స పొందుతూ నిన్న మృతించెందాడు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న నార్త్ జోన్ అడిషనల్ డీజీపీ నేడు ఎస్సై ఉదయ్ కిరణ్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర చర్చనీయాంశం అయింది.