- రేపే గ్రూప్-1 నోటిఫికేషన్!
- 503 పోస్టులు… 3 నెలల్లో నియామక ప్రక్రియ పూర్తి
- 16 వేల పోలీసు కొలువుల భర్తీకి ప్రకటన?
రాష్ట్రంలో కొలువుల జాతర మొదలు కాబోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విధంగా 80,039 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా సోమవారం మొదటి నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం. అత్యంత కీలకమైన గ్రూప్-1తోపాటు పోలీస్ ఉద్యోగాల భర్తీకి రేపు ప్రకటన విడుదల చేయనున్నట్టు తెలిసింది.
ఉద్యోగ నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించడంతో నియామక బోర్డులు పకడ్బందీగా ఏర్పాట్లుచేశాయి. ఒకటికి రెండు సార్లు సమీక్షలు నిర్వహించి ప్రణాళికలు రచించాయి. గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా 19 ప్రభుత్వ విభాగాల్లో 503 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. 3 నెలల్లోనే నియామక ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.