Monday, September 9, 2024

బీఆర్ఎస్ నుంచి పొంగులేటి, జూప‌ల్లి ఔట్‌

Must Read
  • ఎట్టకేలకు కేసీఆర్ నిర్ణయం
  • శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావుపై సస్పెన్షన్ వేటు
  • పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై భారత రాష్ట్ర సమితి నుంచి ఈ ఇద్దరు నేతలను సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొన్నది. కొన్ని రోజులుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి… బీఆర్ఎస్ పార్టీతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు నాయకత్వంపై అసంతృప్తితో తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం పార్టీ అగ్ర నాయకత్వంపై విమర్శలు సంధిస్తున్నారు. పార్టీ తన‌ను పట్టించుకోవడంలేదని మూడేళ్లుగా సభ్యత్వాన్ని కూడా రెన్యువల్ చేయలేదని ఆయన ఆరోపించారు. కాగా వీరిద్దరూ కొత్తగూడెంలో ఆదివారం ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్‌తోపాటు ఆయన కుటుంబంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే పార్టీ కార్యాలయం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన వెలువడడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. మరికొద్ది సేప‌ట్లో పార్టీ తీసుకున్న సస్పెన్షన్ నిర్ణయం పై ఇరువురు నేతలు విడివిడిగా మీడియాతో మాట్లాడనున్నారు.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img