- వీసీకి హైకోర్ట్ ఆదేశం
అక్షరశక్తి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో ముఖాముఖికి ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని అనుమతించాలని ఓయూ వైస్ చాన్స్‌లర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాహుల్ సభకు అనుమతించాలని కోరుతూ బుధవారం రెండోసారి ఓయూ జేఏసీ నాయకులు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై వాదనలు విన్న హైకోర్టు.. రాహుల్ సభకు అనుమతించాలని వీసీని ఆదేశించింది. ఈ నెల ఏడో తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో రాహుల్ గాంధీ ఇంటరాక్షన్ కు కాంగ్రెస్ ప్లాన్ చేసింది. అయితే ఈ సమావేశానికి ఉస్మానియా యూనివర్సిటీ వీసి అనుమతి నిరాకరించారు. దీంతో ఓయూ జేఏసీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై వాదనలు విన్న హైకోర్టు ఈ అంశాన్ని పరిశీలించాలని వీసీకి తెలిపింది. అప్పటికే వీసీ అనుమతి నిరాకరించడంతో మరోసారి హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. వాదనలు విన్న కోర్టు సభకు అనుమతించాలని ఆదేశాలిచ్చింది.
Must Read