అక్షరశక్తి, వర్ధన్నపేట : మే 6వ తేదీన హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో నిర్వహించనున్న రైతు సంఘర్షణ సభకు లక్షలాదిగా నాయకులు, కార్యకర్తలు, రైతులు, నిరుద్యోగులు ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రబెల్లి వరద రాజేశ్వర్ రావు పిలుపునిచ్చారు. వర్దన్నపేట మండల కేంద్రంలోని లక్ష్మి గార్డెన్ నందు మండల కాంగ్రెస్ నాయకులతో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రబెల్లి వరద రాజేశ్వర్ రావు, వరంగల్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, కొల్లాపూర్ నియోజకవర్గం ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే చింతలపల్లి జగదీశ్వర్ రావు, వర్దన్నపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ నమిండ్ల శ్రీనివాస్, డిజిటల్ సభ్యత్వ కోఆర్డినేటర్ గంట సంజీవరెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ హాజరుకానున్న సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎద్దు సత్యనారాయణ, వర్దన్నపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిమిరెడ్డి కృష్ణారెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కి శ్రీకాంత్, పట్టణ అధ్యక్షుడు చిరురాల కుమారస్వామి, మండల మైనార్టీ అధ్యక్షులు ఎండీ అక్బర్, మండల ప్రధాన కార్యదర్శి గూగులోత్ దేవేందర్, బిర్రు రాజు, మాజీ మండల అధ్యక్షుడు బర్ల బాబు, నరుకుడు వెంకటయ్య, కొండేటి బాలకృష్ణ, బిర్రు రాజు, పోలపల్లి బుచ్చిరెడ్డి, మాలోత్ దేవేందర్, దీకొండ ఉపేందర్, మల్లెపాక సమ్మయ్య, కర్ర మాలతిరెడ్డి, జి రవీందర్‌రెడ్డి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.