Saturday, July 27, 2024

మళ్లీ పెరిగిన సిలిండర్ ధర.. నెలలో రెండోసారి..

Must Read

దేశంలో ధ‌ర‌ల మోత‌మోగుతోంది. పెట్రోల్‌, డీజిల్‌, వంట‌నూనెతోపాటు నిత్యావ‌స‌ర స‌రుకులు, కూరగాయ‌ల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇది చాలదన్నట్లు దేశీయ చమురు కంపెనీలు సామాన్య ప్రజలకు మరోసారి షాక్ ఇచ్చాయి. ఎల్పీజీ సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. నెల‌లో రెండోసారి దేశీయ చమురు కంపెనీలు మరోసారి ఎల్పీజీ సిలిండర్ ధరలను పెంచాయి.

కమర్షియల్ సిలిండర్‌తో పాటు గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలను కూడా పెంచాయి. డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 3.50 పెరగ్గా..కమర్షియల్ సిలిండర్ ధర రూ.8 పెరిగింది. తాజా పెంపుతో దేశరాజధాని ఢిల్లీలో 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.1003కి చేరింది. ముంబైలో కూడా ఇదే ధరలకు లభిస్తుంది. ఇక కోల్‌కతాలో రూ.1029 కి చేరింది. చెన్నైలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.1018.50కి పెరిగింది.

హైదరాబాద్‌లో 14.2 కేజీల గృహవినియోగ సిలిండర్ ధర రూ.1055కి పెరిగింది. గతంలో దీని ధర రూ.1052 ఉండేది. వరంగల్‌లో రూ.1074కి పెరిగింది. కమర్షియల్ సిలిండర్ ధర తాజాగా రూ.8 పెరిగింది. తాజా పెంపుతో దేశరాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ రూ.2354కి చేరింది. ముంబైలో 2306, కోల్‌కతాలో 2454, చెన్నైలో 2507కి పెరిగింది. హైదరాబాద్‌లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ రూ.2562.5కి చేరింది. వరంగల్‌లో 2603.50గా ఉంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img