Monday, June 17, 2024

షైనింగ్‌ కుమార్‌

Must Read
  • షైన్ విద్యాసంస్థ‌ల పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న మూగ‌ల‌
  • ఎస్సై జాబ్ మిస్సైనా ప‌ట్టుద‌ల‌తో ముందుకు
  • ప‌లు ప్రైవేట్ విద్యాసంస్థ‌ల్లో టీచ‌ర్‌గా విధులు
  • షైన్ విద్యాసంస్థను ప్రారంభించిన కుమార్‌
  • 50 మంది విద్యార్థులతో మొద‌లై నేడు 4 వేల మందికిపైగా..
  • అనేక అడ్డంకులు దాటుకుంటూ మున్ముందుకు..
  • వంద‌ల మందికి ఉపాధి క‌ల్ప‌న‌
  • నేటి యువ‌త‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్న షైన్ విద్యాసంస్థ‌ల అధినేత మూగ‌ల‌ కుమార్

చ‌దువుకునే రోజుల్లోనే ఆ యువ‌కుడు ఎస్సై కావాల‌ని క‌ల‌లు క‌న్నాడు.. ఇందుకోసం క‌ఠినంగా సాధ‌న కూడా చేశాడు. ఫిజిక‌ల్ ఈవెంట్ల‌లో సెల‌క్ట్ అయిన‌ప్ప‌టికీ, రాత ప‌రీక్ష‌లో ఐదు మార్కులతో ఉద్యోగం కోల్పోయాడు… సీన్ క‌ట్ చేస్తే… ప‌దేళ్ల త‌ర్వాత ఆ యువ‌కుడు రాష్ట్రంలోనే పేరుపొందిన ప్ర‌ముఖ విద్యాసంస్థల‌ అధినేత‌గా ఎదిగారు.. అంతేగాక‌, విద్యాసంస్థ‌ల పేరునే త‌న ఇంటి పేరుగా మార్చుకునేంత కీర్తి ప్ర‌తిష్ట‌లు పొందారు. త‌న విద్యార్థులు ప‌లువురు ఎస్సైలుగా, డాక్ట‌ర్లుగా, ఇంజినీర్లుగా, జాతీయ, అంత‌ర్జాతీయస్థాయి క్రీడాకారులుగా రాణిస్తుంటే గ‌ర్వంతో మురిసిపోతున్నారు. కొన్ని వంద‌ల మందికి ఉపాధి క‌ల్పిస్తూ, వేలాది మందికి స్ఫూర్తిదాయ‌కంగా నిలుస్తున్నారు వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌రంలో పేరుపొందిన షైన్ విద్యాసంస్థ‌ల అధినేత కుమార్‌.. వేల మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు పంచుతున్న షైన్ కుమార్ అక్ష‌ర‌శ‌క్తి ప‌త్రిక‌తో త‌న అనుభ‌వాలు, అనుభూతుల‌ను పంచుకున్నారు. గ‌తంలోకి వెళ్లి జీవితంలోని ఎత్తుప‌ళ్లాల‌ను గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోన‌య్యారు. షైన్ కుమార్ అంత‌రంగం ఆయ‌న మాట‌ల్లోనే…

కుటుంబ స‌భ్యుల ప్రోత్సాహంతో..

మాది హ‌న్మ‌కొండ‌లోని గోకుల్ న‌గ‌ర్‌. నాన్న మూగ‌ల కొముర‌య్య యాద‌వ్‌, త‌ల్లి కొముర‌మ్మ‌.. హ‌న్మ‌కొండ సెయింట్ పీట‌ర్స్ హైస్కూల్‌లో టెన్త్‌, జూనియ‌ర్ కాలేజ్‌లో ఇంట‌ర్ పూర్తిచేశా.. వాగ్దేవి క‌ళాశాల‌లో డిగ్రీ, ఎంఎఫ్‌ఏలో పీజీ కంప్లీట్ చేశా.. ఎనిమిదో త‌ర‌గ‌తి నుంచే ఎస్సై అవ్వాల‌ని కోరిక ఉండేది. స్పోర్ట్స్‌లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసేవాడిని. డిగ్రీలో ఉన్న‌ప్ప‌డు ఎన్సీసీలో చేరా.. సామాజిక స్పృహ‌, విశాల దృక్ప‌థం అక్క‌డే అల‌వ‌ర్చుకున్నా.. ఫిజిక‌ల్ ఈవెంట్‌లో అర్హ‌త సాధించినప్ప‌టికీ రాత ప‌రీక్ష‌లో ఐదు మార్కులతో ఎస్సై ఉద్యోగాన్ని కోల్పోయా.. ఏమాత్రం దిగులు చెంద‌కుండా ఇంత‌క‌న్నా గొప్ప‌గా ఏదైనా సాధించాల‌ని అనుకున్నా… సీఐఎస్ఎఫ్‌లో జాబ్ వ‌చ్చిన‌ప్ప‌టికీ కుటుంబ స‌భ్యులు అభ్యంత‌రం చెప్ప‌డంతో వ‌దిలేశా. పింగిళి హేమ మేడం గారి మ‌హతి పాఠ‌శాల‌లో పీఈటీగా ఉద్యోగంలో చేరి… అదే స్కూల్‌లో సోష‌ల్ టీచ‌ర్‌గా విధులు నిర్వ‌ర్తించా.. ఆక్స్‌ఫ‌ర్డ్‌, డ‌ఫోడిల్స్‌, ఆర్య‌భ‌ట్ట స్కూళ్ల‌ల్లో కూడా ప‌నిచేశా. ఆ త‌ర్వాత నా భార్య‌, త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యుల ప్రోత్సాహంతో 2012లో హ‌న్మ‌కొండ‌లో షైన్ విద్యాసంస్థ‌ను స్వాపించా..

అందుకే షైన్ పేరు పెట్టాం..

విద్యాసంస్థ‌కు ఐదు అక్ష‌రాల పేరు బాగుంటుంద‌ని కుటుంబ స‌భ్యులు, పండితులు సూచించారు. వారి సూచ‌న‌ల మేర‌కు విద్యాసంస్థ‌కు షైన్ పేరుపెట్టాం. ఏ ముహూర్తాన ఆ పేరు పెట్టామో తెలియ‌దుగానీ, అది నిజంగానే దినదినాభివృద్ధి చెంది నేడు అనేక మంది జీవితాల్లో వెలుగులు పంచుతోంది. వంద‌లాది మంది ఉద్యోగుల‌కు ఉపాధి క‌ల్పిస్తోంది. వేలాది మంది విద్యార్థుల బంగారు భ‌విష్య‌త్‌కు బాట‌లువేస్తోంది.
మా షైన్ విద్యార్థులు ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఐఐటీ ముంభై, ఐఐటీ మ‌ద్రాస్‌, ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌, ఐఐటీ హైద‌రాబాద్‌ల‌లో సీట్లు సాధించ‌డం సంతోషంగా ఉంది. అంతేగాక ఢిల్లీ ఎయిమ్స్‌తోపాటు జిప్‌మ‌ర్ (పాండిచ్చేరి), ఉస్మానియా, గాంధీ, కేఎంసీలో మెడిక‌ల్ సీట్లు పొంద‌డం గ‌ర్వంగా ఉంది. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా అనేక మంది జీవితాలు త‌ల‌కిందుల‌య్యాయి. క‌రోనా క‌ష్ట‌కాలంలో బ‌డులు మూత‌ప‌డ్డాయి. మా విద్యాసంస్థ‌లో ప‌నిచేసే ఉపాధ్యాయులు, సిబ్బంది ఆర్థిక ఇబ్బందుల‌కు గురయ్యారు. వారంద‌రికీ అండ‌గా ఉండాల‌ని భావించి లాక్‌డౌన్ స‌మ‌యంలో ఉద్యోగుల కుటుంబాల‌కు నెల‌నెలా బియ్యం, నిత్యావ‌స‌ర స‌రుకులు అందించాం. అదేస‌మ‌మంలో విద్యార్థులు విద్యాసంవ‌త్సరం న‌ష్ట‌పోకుండా ఆన్‌లైన్ త‌ర‌గుతులు నిర్వ‌హించాం.

ఉద్యోగులు, సిబ్బంది కృషి వ‌ల్లే…

తొలుత యాభై మంది విద్యార్థుల‌తో షైన్ స్కూల్‌ను స్టార్ట్ చేశాం.. హ‌న్మ‌కొండ‌లో రేకుల షెడ్డును అద్దెకు తీసుకుని ప్రారంభించాం. కొంత‌కాలానికి ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా నా భార్య బంగారు ఆభ‌ర‌ణాల‌ను తాక‌ట్టు పెట్టి ఆ డ‌బ్బుతో విద్యాసంస్థ‌ను నిల‌బెట్టా. అలా యాభై మంది విద్యార్థుల‌తో మొద‌లైన షైన్ విద్యాసంస్థల ప్ర‌స్థానం దిన‌దినాభివృద్ధి చెందింది. నేడు నాలుగు వేల మంది పిల్ల‌ల‌తో విజ‌య‌వంతంగా దూసుకెళ్తున్నందుకు, సుమారు 350 మందికి సంస్థ‌లో ఉపాధి క‌ల్పిస్తున్నందుకు ఎంతో సంతోషంగా, గ‌ర్వంగా ఉంది. మా పాఠ‌శాల విద్యార్థులు అనేక మంది చ‌దువులోనూ, క్రీడ‌ల్లోనూ రాణిస్తున్నారు. జాతీయస్థాయి పోటీ ప‌రీక్ష‌ల్లో అర్హ‌త సాధించి, పేరుపొందిన సంస్థ‌ల్లో సీటు ద‌క్కించుకుని ఉన్న‌త విద్య అభ్య‌సిస్తున్నారు. అంతేగాక క్రీడ‌ల్లోనూ జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో ప‌త‌కాలు సాధించి షైన్ విద్యాసంస్థ కీర్తి ప్ర‌తిష్ట‌ల‌ను మ‌రింత పెంచుతున్నారు. ఇటీవ‌లే మా పాఠ‌శాల విద్యార్థి అర్జున్ అంతర్జాతీయ స్థాయి చెస్ పోటీల్లో అద్భుత‌ ప్ర‌తిభ క‌న‌బ‌ర్చి ప‌త‌కాలు సాధించాడు. షైన్ సంస్థలో ప‌నిచేసే ఉద్యోగులు, సిబ్బంది కృషి ఫ‌లితంగానే ఈ స‌క్సెస్ సాధ్య‌మైంది. నా ఎదుగుద‌ల‌కు కార‌ణ‌మైన ప్ర‌తి ఒక్క‌రికీ పేరుపేరున కృత‌జ్క్ష‌త‌లు, ధ‌న్య‌వాదాలు తెలుపుకుంటున్నా.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img