Saturday, July 27, 2024

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిగ్ ట్విస్ట్.. సెల్‌ఫోన్లతో ఈడీ విచారణకు కవిత

Must Read

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ మూడోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరయ్యే ముందు కవిత.. తన సెల్‌ఫోన్లను మీడియాకు చూపించారు. మొత్తం 9 సెల్‌ఫోన్లను మీడియాకు చూపించారు. స్పెషల్ కోర్టుకు దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ కంప్లైంట్‌లో కవిత 10 ఫోన్లు వాడినట్లు ఈడీ పేర్కొంది. 2021 సెప్టెంబర్ నుంచి 2022 ఆగస్టు వరకు కవిత మెుత్తం 10 ఫోన్లు మార్చినట్లు అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో మెుత్తం 36 మంది 170 ఫోన్లు మార్చినట్లు ఈడీ పేర్కొంది. ఆధారాలు చేరిపేసే క్రమంలో కవిత తన ఫోన్లు ధ్వంసం చేసినట్లు ఈడీ అభియోగాలు నమోదు చేసింది.

ఈ క్రమంలోనే ఆమె తన ఫోన్లను మీడియాకు చూపించటం చర్చనీయాంశంగా మారింది. తాను ఏ తప్పు చేయలేదని.., రాజకీయ కోణంలోనే ఈడీ విచారణ జరగుతోందని కవిత ఇప్పటికే పలుమార్లు చెప్పారు. అందులో భాగంగానే ఈడీ నమోదు చేసిన అభియోగాలను తిప్పికొట్టాలనే ఉద్దేశ్యంతోనే కవిత ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యే ముందు తన సెల్‌ఫోన్లను చూపించినట్లు తెలుస్తుంది. అంతకు ముందు ఇవాళ్టి విచారణ నేపథ్యంలో ఉదయం సుప్రీం కోర్టు న్యాయవాదులతో కవిత భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు న్యాయవాదులతో చర్చించారు. న్యాయవాదులతో చర్చల అనంతరం.. ఆమె సీఎం కేసీఆర్ నివాసానికి చేరుకొని అక్కడి నుంచి తన లాయర్లతో కలిసి ఈడీ కార్యాలయానికి బయల్దేరారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img